Telangana Student: పదిహేడేళ్ల వయసులోనే తెలంగాణ విద్యార్థినికి రూ.2 కోట్ల బంపర్ ఆఫర్.. అంతేకాదు..

విద్యార్థిని శ్వేతారెడ్డి

అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన కళాశాలల్లో పెన్సెల్‌వేనియా రాష్ట్రంలోని లాఫాయేట్ కాలేజీ ఒకటి. 1826లో స్థాపించిన ఈ కళాశాలకు దాదాపు 195 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంతటి ప్రముఖ కళాశాలలో డిగ్రీ చేసేందుకు అమెరికాలోని విద్యార్థినీవిద్యార్థులు పోటీ పడుతుంటారు. అలాంటి లాఫాయేట్ కాలేజీలో తెలంగాణ విద్యార్థినికి సీటు దక్కింది.

  • Share this:
    హైదరాబాద్: అమెరికాలో ప్రఖ్యాతి గాంచిన కళాశాలల్లో పెన్సెల్‌వేనియా రాష్ట్రంలోని లాఫాయేట్ కాలేజీ ఒకటి. 1826లో స్థాపించిన ఈ కళాశాలకు దాదాపు 195 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంతటి ప్రముఖ కళాశాలలో డిగ్రీ చేసేందుకు అమెరికాలోని విద్యార్థినీవిద్యార్థులు పోటీ పడుతుంటారు. అలాంటి లాఫాయేట్ కాలేజీలో తెలంగాణ విద్యార్థినికి సీటు దక్కింది. ఏకంగా ఆ కళాశాలనే శ్వేతారెడ్డి(17) అనే తెలంగాణకు చెందిన విద్యార్థినికి రూ.2 కోట్ల మేర స్కాలర్‌షిప్ ఆఫర్ చేసింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను లాఫాయేట్ కాలేజీ శ్వేతకు ప్రకటించింది. ఎంతో మంది విద్యార్థినీవిద్యార్థుల కల ఈ కళాశాలలో అడ్మిషన్ పొందడం.

    అలాంటిది.. ఆ కాలేజే శ్వేతారెడ్డికి అడ్మిషన్‌తో పాటు స్కాలర్‌షిప్‌ను ప్రకటించడమంటే మామూలు విషయం కాదు. డైయర్ ఫెలోషిప్(DYER FELLOWSHIP) పేరిట లాఫాయేట్ కాలేజీ ఇచ్చే ఈ స్కాలర్‌షిప్‌కు కేవలం ఆరుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఆ ఆరుగురిలో శ్వేతారెడ్డి ఒకరు కావడం విశేషం.



    ఆమె ఈ ఘనత సాధించిన విషయాన్ని ఆమెకు శిక్షణ ఇచ్చిన డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ వెల్లడించింది. 2008లో స్థాపించబడిన ఈ సంస్థ కెరీర్ డెవలప్‌మెంట్ శిక్షణనిచ్చి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, నైపుణ్యాన్ని తీర్చిదిద్ది విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసే సదుద్దేశంతో ముందుకు సాగుతోంది. డెక్స్‌టెరిటీ టూ కాలేజ్ కెరీర్ డెవలప్‌మెంట్‌లో శ్వేత నాలుగేళ్ల శిక్షణ పొంది.. హైస్కూల్ స్థాయిలోనే ప్రతిభ కనబర్చి లాఫాయెట్ కాలేజీ యాజమాన్యం దృష్టిలో పడటమే కాక ఇప్పుడీ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.


    ఈ అవకాశం రావడం పట్ల శ్వేతారెడ్డి స్పందిస్తూ.. తనకు ఇలాంటి అరుదైన అవకాశం రావడం ఎంతో గర్వ కారణమని.. ఈ అవకాశం రావడానికి డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ శిక్షణ, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని ఆమె చెప్పారు. శ్వేతారెడ్డి లాఫాయెట్ కాలేజీ స్కాలర్‌షిప్‌కు ఎంపికై అడ్మిషన్ సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు. శ్వేత ఈ అవకాశం పొందడం తెలంగాణకు ఒక గర్వ కారణమైన సందర్భమని.. ఎంతోమందికి శ్వేత ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆమె ఈ విధంగా ముందుకు వెళుతూ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
    Published by:Sambasiva Reddy
    First published: