Half day schools: తెలంగాణలో ఒంటిపూట బడులు... ఎప్పటి నుంచి అంటే...

తెలంగాణలో ఒంటిపూట బడులు... ఎప్పటి నుంచి అంటే... (ప్రతీకాత్మక చిత్రం)

TS Half day schools: తెలంగాణలో శివరాత్రికి ముందు నుంచే ఎండల తీవ్రత పెరిగింది. విద్యార్థులు తట్టుకోలేరు కాబట్టి ఒంటి పూట బడులు నిర్వహించబోతున్నారు.

  • Share this:
    TS Half day schools: తెలంగాణలో ఎండలు బాగా పెరగడంతో... ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ రెడీ అవుతోంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉండబోతున్నాయి. మార్చి 22 లేదా 23 నుంచి ఒంటిపూట తరగతులు మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రెడీ చేసి... ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంటే... రోజూ 4న్నర గంటల పాటూ తరగతులు నిర్వహించాలన్నది విద్యాశాఖ ఆలోచనగా తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఐతే... ఈ విద్యా సంవత్సరంలో మే 26ను చివరి పని దినంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి ఒంటిపూట తరగతులకు అనుమతిస్తే.. దాదాపు 2 నెలలపాటూ ఒంటిపూట బడులు జరుగుతాయి.

    ప్రతి సంవత్సరం మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు... ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఒంటిపూట బడులు జరిగేవి. మధ్యాహ్నం 12.30కి మధ్యాహ్న భోజనం పెట్టి... విద్యార్థులను ఇళ్లకు పంపేవారు. ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఇచ్చి... జూన్ 12న మళ్లీ స్కూళ్లు తెరిచేవాళ్లు.

    ఈ సంవత్సరం కరోనా వల్ల స్కూళ్లు చాలా కాలం తెరవలేదు. ఆన్‌లైన్ క్లాసులు జరిపారు. ఆలస్యంగా స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న 9, 10 తరగతులకు ప్రారంభం కాగా... ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ 6, 7, 8 తరగతులు ప్రారంభమయ్యాయి. ఐతే... చాలా మంది విద్యార్థులను తల్లిదండ్రులే స్కూళ్లకు పంపట్లేదు. కరోనా భయాలున్నాయి.

    ఇది కూడా చదవండి: Business Idea: రూ.50,000 పెట్టుబడితో సంవత్సరానికి రూ.10 లక్షల సంపాదన

    ఈ పరిస్థితుల్లో 6, 7, 8, 9 తరగతులకు ఒంటిపూట బడులు నిర్వహించి... పదో తరగతి విద్యార్థులకు మాత్రం రెండు పూటలా స్కూళ్లు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. ఎందుకంటే పదో తరగతి విద్యార్థులకు మే 17 నుంచి ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రభావం సిలబస్‌పై పడనివ్వకుండా... అన్ని స్కూళ్లలో టీచర్లు... ఫాస్ట్‌గా సిలబస్ పూర్తి చేయిస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: