Home /News /jobs /

TELANGANA STATE PUBLIC SERVICE COMMISSION PLANS TO RELEASE AMVI JOB NOTIFICATION SOON HERE DETAILS NS

TSPSC Job Notification: నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC నుంచి త్వరలో మరో జాబ్ నోటిఫికేషన్.. ఖాళీలు, విద్యార్హతలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

త్వరలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలకు TSPSC సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన మేరకు తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 503 గ్రూప్ ఖాళీలతో పాటు 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు (TSPSC Job Notification) విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెలాఖరుకు గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సైతం సాగుతోంది. అయితే.. త్వరలోనే మరో నోటిఫికేషన్ విడుదలకు సైతం టీఎస్పీఎస్సీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 149 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్(ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి త్వరలోనే టీఎస్పీఎస్సీ (TSPSC) నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీ నుంచి గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్1 కు సంబంధించి ఆదివారం సాయంత్రం వరకు మొత్తం 50,986 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
    Govt Jobs Preparation: ఎస్సై, గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే అర్ధమెటిక్ టాపిక్‌పై టిప్స్‌

    ఇదిలా ఉంటే.. గ్రూప్ 1 ఉద్యోగాల కోసం మార్కెట్లో వందలాది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏ పుస్తకం చదవాలో అర్థం కాక అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నియమించిన సిలబస్ కమిటీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ హరగోపాల్ ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తెలుగు అకాడమీతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి ఆయా సబ్జెక్టుల నిపుణులతో పుస్తకాలు రూపొందించారన్నారు.
    TS Jobs Free Coaching: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి శుభవార్త.. ఫ్రీగా కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ రాసిన పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఈ ఏడేళ్లలో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి గురించి అభ్యర్థులు తెలుసుకోవాలని వివరించారు. తెలంగాణ బడ్జెట్, ఆవిర్భావం తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారడం లాంటి అంశాలు, కారణాల గురించి తెలుసుకోవాలన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Govt Jobs 2022, JOBS, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు