Home /News /jobs /

TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD RELEASED NOTIFICATION FOR DRIVER OPERATOR JOBS IN FIRE SERVICES DEPARTMENT NS

Telangana Govt Jobs: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మరో నోటిఫికేషన్.. ఇంటర్ అర్హతతో జాబ్స్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నుంచి అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 26వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అభ్యర్థులు ఆ రోజు రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 21 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండాలి.
    Telangana Police Jobs Applications: తెలంగాణ పోలీస్ జాబ్స్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తు గడుపు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

    మొత్తం 225 పోస్టులకు గాను జోన్ల వారీగా ఖాళీల వివరాలు..







































    జోన్ఖాళీలు
    Zone - I – Kaleshwaram20
    Zone - II – Basara21
    Zone - III – Rajanna31
    Zone - IV – Bhadradri31
    Zone - V – Yadadri31
    Zone - VI – Charminar70
    Zone - VII – Jogulamba21
    మొత్తం ఖాళీలు:225


    ఇంకా అభ్యర్థులు నోటిఫికేషన్ జారీ చేసిన తేదీకి రెండేళ్లు లేదా అంతకంటే ముందు హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ www.tslprb.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు