Home /News /jobs /

TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD RELEASED JOB NOTIFICATION FOR 587 SI JOBS KNOW EDUCATIONAL QUALIFICATIONS SS

Telangana SI Jobs: తెలంగాణలో 587 ఎస్‌ఐ పోస్టులు... విద్యార్హతలివే

Telangana SI Jobs: తెలంగాణలో 587 ఎస్‌ఐ పోస్టులు... విద్యార్హతలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana SI Jobs: తెలంగాణలో 587 ఎస్‌ఐ పోస్టులు... విద్యార్హతలివే (ప్రతీకాత్మక చిత్రం)

Telangana SI Jobs | తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) మొత్తం 587 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. విద్యార్హతలు, ఇతర అర్హతల వివరాలను డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

    తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) మొత్తం 16,614 సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, ఇతర అర్హతలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగం పొందడానికి ఏఏ అర్హతలు ఉండాలి? ఎస్ఐ జాబ్ కోరుకునేవారికి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? తెలుసుకోండి.

    Telangana SI Jobs: తెలంగాణలో ఎస్ఐ పోస్టుల వివరాలు ఇవే

















































     మొత్తం ఖాళీలు 587
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil) 414
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR) 66
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) (Men) 05
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP) (Men) 23
     సబ్ ఇన్‌స్పెక్టర్ (Men) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్ 12
     స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ 26
     డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ 8
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization) 22
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization)03
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 8

    IT Jobs: ఫ్రెషర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్... ఎంట్రీ సాలరీ భారీగా పెంచిన ఐటీ కంపెనీలు

    Telangana SI Jobs: విద్యార్హతల వివరాలు ఇవే


    ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి. 2022 జూలై 1 నాటి అర్హతలు ఉండాలి. 31వ నెంబర్ పోస్టుకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. 32వ నెంబర్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ కావాలి. 33వ నెంబర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పాస్ కావాలి.

    Telangana Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు

    Telangana SI Jobs: శారీరక ప్రమాణాలు


    11, 12, 13, 14, 16, 17, 18 నెంబర్ పోస్టులకు పురుషులు 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. 11, 12 పోస్టులకు మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ఏరియాల్లోని వారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.

    31, 32, 33 నెంబర్ పోస్టులకు పురుషులు 162 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారైతే పురుషులు 160 సెంటీమీటర్లు, మహిళలు 150 సెంటీమీటర్లు ఉండాలి.

    లాంగ్ జంప్ ఈవెంట్‌లో పురుషులు (జనరల్) 4 మీటర్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3.5, షాట్‌పుట్ ఈవెంట్‌‌లో ఇద్దరికీ 6 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మహిళ అభ్యర్థులకు లాంగ్ జంప్ 2.50 మీటర్లు, షాట్ పుట్ 4 మీటర్ల క్వాలిఫయింగ్ డిస్టెన్స్ ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Govt Jobs 2022, JOBS, State Government Jobs, Telangana government jobs, Telangana jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు