హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Constable Jobs: నిరుద్యోగులకు అలర్ట్... తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష వాయిదా

TS Constable Jobs: నిరుద్యోగులకు అలర్ట్... తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష వాయిదా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 2022 ఆగస్ట్ 21న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా ఎగ్జామ్‌ను వారం రోజులు వాయిదా వేసింది. 2022 ఆగస్ట్ 28న ఎగ్జామ్ జరగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. 2022 ఆగస్ట్ 21న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా ఎగ్జామ్‌ను వారం రోజులు వాయిదా వేసింది. 2022 ఆగస్ట్ 28న ఎగ్జామ్ జరగనుంది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 25న, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2022 ఏప్రిల్ 28న నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టులన్నింటికీ ఆగస్ట్ 21 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుందని ముందుగానే ప్రకటించింది. కానీ లాజిస్టిక్స్, పరిపాలనా పరమైన కారణాల వల్ల ఆగస్ట్ 21న జరగాల్సిన ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

తెలంగాణ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్ట్ 28 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరగనుంది. హాల్ టికెట్స్ ఆగస్ట్ 18న విడుదలవుతాయి. అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌లో ఆగస్ట్ 18 నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

SAIL Recruitment 2022: సెయిల్‌లో 200 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సివిల్, ఏఆర్, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్, మెకానిక్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కానిస్టేబుల్ పోస్టులకు 6,50,000 పైగా అభ్యర్థులు హాజరవుతారని అంచనా.

LIC Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి ఎల్ఐసీ నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

ప్రిలిమ్స్‌లో క్వాలిఫైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. ఇందులో క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ రాతపరీక్ష ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ భావిస్తోంది.

First published:

Tags: Govt Jobs 2022, JOBS, State Government Jobs, Telangana government jobs, Telangana jobs, Ts constable

ఉత్తమ కథలు