Home /News /jobs /

TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD MAY RELEASE NOTIFICATION CONSTABLE AND SI JOBS SOON NS

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్.. నోటిఫికేషన్లు ఎప్పుడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల ఆర్థిక శాఖ గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్లు వెంటనే విడుదల అవుతాయని అంతా భావించారు. అయితే ఉగాది పర్వదినం నాడు నోటిఫికేషన్లు వస్తాయన్న ప్రచారం సాగింది. అయితే..

    తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించి నెల దాటినా.. ఇంకా నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఇటీవల ఆర్థిక శాఖ గ్రూప్ 1 (TSTSC Group 1), పోలీస్ ఉద్యోగాల (Police Jobs) భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్లు వెంటనే విడుదల అవుతాయని అంతా భావించారు. అయితే ఉగాది పర్వదినం నాడు నోటిఫికేషన్లు వస్తాయన్న ప్రచారం సాగింది. అయితే.. ఉగాది రోజు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంపై మళ్లీ నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే.. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఖాళీల భర్తీకి కసరత్తు పూర్తి కావొచ్చినట్లు సమాచారం. టీఎస్ఎల్పీఆర్బీ నుంచి మొత్తం 16,804 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి ఆయా విభాగాల నుంచి బోర్డు ఇండెంట్లను సేకరించింది. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్హతలు, దేహదారుఢ్య ప్రమాణాలు, రోస్టర్‌ పాయింట్లు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితర వివరాలు బోర్డుకు చేరాయి.

    అయితే ఈ ఉద్యోగాల భర్తీకి కేవలం నోటిఫికేషన్ల విడుదల మాత్రమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఇందుకు సంబంధించిన అనుమతులు వస్తాయని మరికొందరు అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా.. మరో వారం, పది రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అవడం ఖాయమని సమాచారం. అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలతో సంబంధం లేకుండా ప్రిపరేషన్ ను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.
    TSPSC Group 2: గ్రూప్ 2 జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

    తెలంగాణలో భారీగా ఉద్యోగాల (Telangana Government Jobs) భర్తీకి తెర లేపిన కేసీఆర్ సర్కార్ త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేయనుంది. దీంతో నిరుద్యోగులంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్, ఎస్ఐ ఖాళీలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. కోచింగ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. జిల్లాకు దాదాపు 100 మంది చొప్పున తెలంగాణకు చెందిన మొత్తం 3300 మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు