హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

DEET App: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరం... డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ యాప్

DEET App: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరం... డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ యాప్

DEET App: మీ అర్హతలకు తగ్గ జాబ్ కావాలా? డీట్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి ఇలా
(image: DEET)

DEET App: మీ అర్హతలకు తగ్గ జాబ్ కావాలా? డీట్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి ఇలా (image: DEET)

DEET App | మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? డీట్ యాప్‌లో జాబ్ సెర్చ్ చేయడం చాలా సులువు. మొదట డీట్ యాప్‌లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్ రూపంలో నిరుద్యోగులకు అద్భుతమైన వరం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని యువతీయువకులు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు చక్కని ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దేశంలో నిరుద్యోగులకు ఇలాంటి ప్లాట్‌ఫామ్ మొదటిసారిగా రూపొందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ గురించి అందరికీ తెలిసిందే. జిల్లా కేంద్రాల్లో ఉండే ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్‌లో పేర్లు నమోదు చేసుకుంటే... ఏవైనా ఖాళీలు ఉన్నప్పుడు ప్రభుత్వం వారికి సమాచారం ఇస్తుంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం, హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారడంతో నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది కార్మిక ఉపాధ కల్పన శాఖ. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్, వెబ్‌సైట్ రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్స్‌ని నిరుద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? డీట్ యాప్‌లో జాబ్ సెర్చ్ చేయడం చాలా సులువు. మొదట డీట్ యాప్‌లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా ఎంప్లాయర్స్ ఎవరైనా డీట్ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్ అప్‌లోడ్ చేస్తే... ఆ ఉద్యోగాలకు మీకు తగిన అర్హతలు ఉన్నట్టైతే మీకు మెసేజ్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆల్గరిథమ్స్ ద్వారా మీ అర్హతలకు తగ్గ ఉద్యోగాలను డీట్ యాప్ సూచిస్తుంది. నిరుద్యోగులు మాత్రమే కాదు... ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్ ద్వారా ఈ సేవలన్నింటినీ ఉచితంగానే అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కంపెనీలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్లను ఉచితంగానే నమోదు చేయొచ్చు.

ప్రభుత్వం రూపొందించి, నిర్వహిస్తున్న ప్లాట్‌ఫామ్ కాబట్టి ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలకు బ్రేక్ కూడా పడుతుంది. ప్రైవేట్ సంస్థలు ఏవైనా ఉద్యోగుల కోసం వివరాలు అప్‌లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్లు వెంటనే యాప్‌లో కనిపించవు. యాప్ నిర్వాహకులు ఆ నోటిఫికేషన్ నిజమైనదేనా? సదరు కంపెనీ నిజంగానే ఉద్యోగాలను ఇస్తోందా? అసలు కంపెనీ ఏంటీ? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? అని పరిశీలిస్తారు. మూడు అంచెల్లో పరిశీలన జరిపిన తర్వాతే యాప్‌లో జాబ్ నోటిఫికేషన్స్ అప్‌లోడ్ అవుతాయి. డీట్ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఇప్పటికే జీఎంఆర్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, స్విగ్గీ లాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పటికే డీట్ ప్లాట్‌ఫామ్‌లో 45,000 ఉద్యోగాలకు ప్రకటనలున్నాయి. మరిన్ని వివరాలను https://tsdeet.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 జాబ్స్... పరీక్షల సిలబస్ తెలుసుకోండి

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, EMPLOYMENT, Exams, JOBS, NOTIFICATION, Telangana, Telangana Government, Telangana News, Telangana updates

ఉత్తమ కథలు