హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs 2022: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, పోస్టుల వివరాలిలా..

Telangana Jobs 2022: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, పోస్టుల వివరాలిలా..

Telangana Jobs 2022: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, పోస్టుల వివరాలిలా..

Telangana Jobs 2022: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. అర్హత, పోస్టుల వివరాలిలా..

Telangana Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. మేనేజర్/ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్, మహిళా నర్స్‌లు, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, చౌకీదార్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక https://wdcw.tg.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో వ్యక్తిగత వివరాలతోపాటు.. విద్యార్హతలకు సంబంధించి వివరాలను నమోదు చేసి.. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను పంపించాలి. వీరిని హైదరాబాద్ జిల్లాలోని స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, శిశువిహార్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్‌ కింద నియమిస్తారు.

మొత్తం పోస్టులు 10

విభాగాల వారీగా ఇలా..

1.మేనేజర్/ కోఆర్డినేటర్(ఎస్‌ఏఏ) - 01

2. సోషల్ వర్కర్(ఎస్‌ఎస్‌ఏ) - 05

3. మహిళా నర్స్‌లు (ఎస్‌ఎస్‌ఏ) - 02

4. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఐసీపీఎస్‌)-01

5. చౌకీదార్ (ఎస్‌ఏఏ) - 01

Teaching Posts 2022: గుడ్ న్యూస్.. టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

విద్యార్హతలు ఇలా..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఏఎన్‌ఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

మేనేజర్/ కోఆర్డినేటర్(ఎస్‌ఏఏ).. పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,750 వేతనం ఇవ్వబడుతుంది.

సోషల్ వర్కర్(ఎస్‌ఎస్‌ఏ).. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,200 వేతనం ఇవ్వబడుతుంది.

DRDO Jobs 2022: డీఆర్డీఓ నుంచి 1061 ఉద్యోగాలు .. జీతం రూ.లక్షకు పైగా..

మహిళా నర్స్‌లు (ఎస్‌ఎస్‌ఏ).. ఏఎన్ఎం కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13,240 వేతనం ఇవ్వబడుతుంది.

అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఐసీపీఎస్‌).. కంప్యూటర్ అప్లికేషన్ లో డిప్లొమా అండ్ బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డేటా ఎంట్రీలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఆఫీస్ వర్క్ లో కూడా అనుభవం తప్పనిసరి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్లు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13,000 వేతనం ఇవ్వబడుతుంది.

చౌకీదార్ (ఎస్‌ఏఏ).. మంచి ప్రవర్తన, ఎలాంటి పోలీస్ కేసులు లేని వ్యక్తి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7,800 వేతనం ఇవ్వబడుతుంది.

Andhra Pradesh Jobs : డిగ్రీ అర్హతతో.. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు .. రూ.76వేల వేతనం..

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ తేదీ : నవంబర్ 03, 2022.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: నవంబర్ 19, 2022.

దరఖాస్తులను సమర్పించాల్సిన చిరునామా.. O/o జిల్లా సంక్షేమ అధికారి, WCD&SC, హైదరాబాద్ , కలెక్టరేట్ ఆవరణ, Iవ అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ 500 001.

నోటిఫికేషన్ PDF కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  పూర్తి విరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

First published:

Tags: JOBS, Telangana government jobs, Telangana jobs

ఉత్తమ కథలు