తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అండ్ వయో వృద్ధుల సంక్షేమ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హెల్ప్ డెస్క్ కో ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్(Offline) విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను https://wdsc.telangana.gov.in/ సందర్శించి.. నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా.. వివరాలను తనిఖీ చేసి.. దరఖాస్తులను సమర్పించవచ్చు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. హెల్ప్ డెస్క్ కో ఆర్డినేటర్(Help Desk Co Ordinator), డేటా ఎంట్రీ ఆపరేటర్(Data Entry Operator) ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:-
1. హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్: ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చదివి ఉన్న వారు అర్హులు. బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ( హ్యుమానిటీ, సోషల్ వర్క్, సైకాలజీ) కోర్సు చేసి ఉండాలి. అంతే కాకుండా.. ఏదైనా ట్రాన్స్ జెండర్ స్వచంద సంస్థ నందు మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. నెలకు రూ.50,000 వేతనం ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ శిక్షణ PGDCA నందు ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 26,749 జీతం చెల్లించనున్నారు. అభ్యర్థుల యొక్క వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ధరఖాస్తు ఫారాలు మరియు ఇతర వివరాలు www.wdsc.Telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నిర్ణీత ఫార్మాట్ లో ధరఖాస్తు ఫారాలను నింపి, సంబదిత ధ్రువపత్రాలు జతపరిచి, నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. సంచాలకుల వారి కార్యాలయము, వికలాంగుల & వయో వృద్ధుల సంక్షేమ శాఖ, మలకపేట, నల్లగొండ X రోడ్, హైదరాబాద్ అడ్రస్ కు దరఖాస్తులను స్పీడ్ పోస్టు లేదా ఆర్డినరీ పోస్టు ద్వారా నవంబర్ 30, 2022లోగా దరఖాస్తులను పంపించాలి. ఏదైనా ఇతర వివరాలకు ఫోన్ నెం. 040-24559048 ను సంప్రదించవచ్చు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.