Home /News /jobs /

TELANGANA STATE COUNCIL OF HIGHER EDUCATION TSCHE WILL CONDUCT DEGREE AND PG EXAMS IN SECOND WEEK OF AUGUST SS

Telangana: డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ... ఎగ్జామ్స్ ఎప్పుడంటే

Exams: డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ... ఎగ్జామ్స్ ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Exams: డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ... ఎగ్జామ్స్ ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Degree and PG exams | తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశముంది. పరీక్షల్ని వచ్చే నెలలోనే నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి-TSCHE కసరత్తు చేస్తోంది.

    డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల్ని సెప్టెంబర్ చివరిలోగా నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షల్ని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణలో డిగ్రీ, పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ ఆగస్ట్ మూడో వారంలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టులో పరీక్షల్ని ముగిస్తే సెప్టెంబర్ లోగా ఫలితాలు విడుదలవుతాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి-TSCHE త్వరలో యూనివర్సిటీలతో సమావేశం నిర్వహించి పరీక్షల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. పరీక్షల్ని ఆఫ్‍లైన్‌లోనే నిర్వహించే అవకాశముంది.

    Police Jobs: డిగ్రీ పాసైనవారికి 1564 పోలీస్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Govt Jobs: సెబీలో 147 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    తెలంగాణలోని 1.50 లక్షల మంది సాంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులు, 50,000 నుంచి 60,000 మంది ప్రొఫెషనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. యూజీసీ ఆదేశాలు జారీ చేయడంతో త్వరలో పరీక్షల్ని నిర్వహించేందుకు కసరత్తు మొదలైంది. అయితే పరీక్షల్ని మూడు గంటలు కాకుండా రెండు గంటలే నిర్వహిస్తారు. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం చివరి సెమిస్టర్, ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రత్యేక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, Lockdown, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు