TELANGANA STATE COUNCIL OF HIGHER EDUCATION TSCHE PARTNERS WITH TCS ION FOR OFFERING CAREER SKILLS VANTAGE PROGRAM SS
Telangana Jobs: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఉచితంగా కోర్సులు
Telangana Jobs: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఉచితంగా కోర్సులు
(ప్రతీకాత్మక చిత్రం)
Telangana Jobs | మంచి ఉద్యోగం కోసం స్కిల్స్ పెంచుకోవాలనుకునే విద్యార్థులకు ఉచితంగా కోర్సును అందిస్తోంది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
మీరు చదువుకుంటున్నారా? మంచి ఉద్యోగం సంపాదించేందుకు స్కిల్స్ పెంచుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ అయాన్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన కోర్సుల్ని టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ ద్వారా అందించనుంది. చదువుకుంటున్నవారు, చదువు పూర్తి చేసుకున్నవారు మంచి ఉద్యోగం పొందేందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకునేందుకు ఈ కోర్సులు ఉపయోగపడతాయి. అంతేకాదు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంతో పాటు, జాబ్ మార్కెట్లో పోటీపడటానికి ఈ స్కిల్స్ తోడ్పడతాయి.
— Tata Consultancy Services Newsroom (@TCS_News) April 22, 2020
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, టీసీఎస్ అయాన్ సంస్థ ఒప్పందం ద్వారా రూపొందించిన ఈ కోర్సులు తెలంగాణలోని ఉన్నత విద్య అందిస్తున్న 1500 సంస్థలకు చెందిన నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఉచితం. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్‌లో ఎప్పుడైనా, ఎక్కడ్నుంచైనా ఈ కోర్సుల్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్ https://www.tsche.ac.in/ ఓపెన్ చేసి చూడొచ్చు. మరి మీరు కూడా ఆ కోర్సుల్ని నేర్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.