TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ సారి ర్యాంకుల కేటాయింపులో మార్పులు.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపు విషయంలో వార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా నేపథ్యంలో ఈ సారి ఇంటర్ పరీక్షలను తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వం సైతం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ ర్యాంకుల కేటాయింపు విధానంలో అధికారులు మార్పులు చేశారు. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో గతంలో ఇంటర్ మార్కులకు సైతం వెయిటేజీ ఇచ్చేవారు. అయితే ఈ సారి ఆ విధానాన్ని తొలగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. కేవలం ఎంసెట్ లో అభ్యర్థులు సాధించిన మార్కులనే పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్ లో 45 శాతం వెయిటేజీని ఇచ్చి ర్యాంకులను నిర్ణయించేవారు. అయితే.. ఈ సారి కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడంతో మార్కుల కేటాయింపునకు ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులను అధికారులు అనుసరించారు. దీంతో ఇంటర్ మార్కులకు ఎంసెట్ లో గతంలో ఇచ్చే వెయిటేజీని ఈ సారి తొలగించారు.
    Telangana Admissions: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే
    TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. కీ విడుదల.. వివరాలివే

    ఇదిలా ఉంటే, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్(JNTUH) తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఈ సారి ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించింది. ఎంసెట్ పరీక్షకు సంబంధిని కీ ని సైతం నిన్న జేఎన్టీయూ విడుదల చేసింది. కీ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు తమ అభ్యంతరాలను తెలపవచ్చు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను కమిటీ అధ్యాయనం చేస్తుంది. విద్యార్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను కమిటీ అంగీకరిస్తే అందకు అనుగుణంగా కీలో మార్పులు చేస్తారు. ఫైనల్ కీ ఆధారంగా సాధ్యమైనంత త్వరలో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

    ఇదిలా ఉంటే.. ఎనిమిది  రాష్ట్రాలలో ఆగస్టులో పాఠశాలలు తెరుచుకున్నాయి. దేశంలో మొట్టమొదటగా హర్యానాలో 9 నుండి 12 వ తరగతి వరకు తొలి ఫేస్ టూ ఫేస్ క్లాసులు ప్రారంభమయ్యాయి. జూలై 16 నుంచి వీటిని ప్రారంభించారు. తరువాత నాగాలాండ్ 11, 12 తరగతులకు జూలై 26 నుంచి అనుమతించింది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఆగస్టు 16 నుంచి స్కూళ్లు తెరవాలని ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. అందుకు కావాల్సిన కోవిడ్‌ ప్రోటోకాల్‌ కు ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 23 నుంచి కర్టాటకలో బడులు తెరుచుకోనున్నాయి.  తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీటిని విడతల వారీగా తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published: