Home /News /jobs /

TELANGANA STATE COUNCIL FOR HIGHER EDUCATION TO INTRODUCE NEW DEGREE COURSES WITH DATA SCIENCE ANALYTICS ARTIFICIAL INTELLIGENCE SUBJECTS SS

Degree Courses: ఇంటర్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్... కొత్త సబ్జెక్ట్స్‌తో డిగ్రీ కోర్సులు

Degree Courses: ఇంటర్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్... కొత్త సబ్జెక్ట్స్‌తో డిగ్రీ కోర్సులు
(ప్రతీకాత్మక చిత్రం)

Degree Courses: ఇంటర్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్... కొత్త సబ్జెక్ట్స్‌తో డిగ్రీ కోర్సులు (ప్రతీకాత్మక చిత్రం)

Telangana New Degree Courses | ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలనుకుంటున్నారా? కొత్త కోర్సులు ఏవైనా చేయాలనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సరికొత్త డిగ్రీ కోర్సుల్ని అందించబోతోంది.

    ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సుల్ని ప్రవేశపెట్టబోతోంది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. బీఎస్సీ డేటా సైన్స్, బీకాం అనలిటిక్స్ లాంటి కోర్సుల్ని అందించబోతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ కొత్త కోర్సుల్ని రూపొందిస్తోంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే. డేటా సైన్స్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త స్ట్రీమ్స్‌దే ఇప్పుడు హవా. ప్రస్తుతం ఉన్న డిగ్రీ కోర్సులతో ఈ సాంకేతికతను అందుకోవడం కష్టమైపోతుంది. డిగ్రీ చదివిన విద్యార్థులు మళ్లీ వీటి కోసం ప్రత్యేకంగా కోర్సులు చేయాల్సి వస్తోంది. అందుకే ఈ సబ్జెక్ట్స్‌తో డిగ్రీ కోర్సుల్ని రూపొందించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ కోర్సులకు సంబంధించిన విధివిధానాలను రూపొందించేందుకు అధికారులతో పాటు ఆయా సబ్జెక్టుల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. రెండు రోజుల క్రితం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కమిటీ సమావేశం కూడా జరిగింది.

    బీఎస్సీ డిగ్రీలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌తో పాటు డేటా సైన్స్, బీకాంలో బిజినెస్ అనలిటిక్స్ చదువుకోవచ్చు. వీటిలోనే ఆనర్స్ డిగ్రీలు ప్రవేశపెట్టనుంది. రెగ్యులర్‌గా చదివే డిగ్రీల కన్నా ఆనర్స్ డిగ్రీలో 20-30 క్రెడిట్స్ ఎక్కువగా ఇచ్చి అమలు చేయాలన్న ఆలోచనలో ఉంది ఉన్నత విద్యామండలి. ఇవే కాదు... మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సబ్జెక్టులతో బీఎస్సీ కోర్సుల్ని అందించనుంది. మొదట ఈ కోర్సులు సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల్లో, అటానమస్ కాలేజీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టనుంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఈ సబ్జెక్టులను బోధించే ఫ్యాకల్టీకి ఇండస్ట్రీకి చెందిన నిపుణులతో శిక్షణ ఇవ్వనుంది. కొత్త కోర్సులపై చర్చించేందుకు వచ్చే వారం మరోసారి కమిటీ సమావేశం కానుంది. విద్యార్థులు ఇలాంటి కొత్త కోర్సులు చేయండం ద్వారా ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Intermediate: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త... యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలు

    Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు

    Axis Bank Jobs: ఈ కోర్సు పాసైతే యాక్సిస్ బ్యాంకులో జాబ్ గ్యారెంటీ
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Artificial intelligence, CAREER, EDUCATION, Information Technology, JOBS, Science, Technology, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    తదుపరి వార్తలు