హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 

Telangana New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 

Telangana New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 

Telangana New Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. 

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కో-ఆప‌రేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (Telangana State Cooperative Apex Bank Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ కో-ఆప‌రేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (Telangana State Cooperative Apex Bank Limited) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా రాష్ట్రంలో మొత్తం 40 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో స్టాఫ్ అసిస్టెంట్,  మేనేజ‌ర్  స్కేల్ 1 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. నోటిఫికేష‌న్‌, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://tscab.org/apex-bank/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

పోస్టుల వివ‌రాలు..

పోస్టు పేరు ఖాళీలుఅర్హ‌త‌లు  వేత‌నం
స్టాఫ్ అసిస్టెంట్ 13గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో 55 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.   తెలుగుపై ప‌ట్టు ఉండాలి. రూ. 17,900 నుంచి రూ.47,920
మేనేజ‌ర్ స్కేల్ 127గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో 55 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. తెలుగుపై ప‌ట్టు ఉండాలి. రూ. 36,000 నుంచి రూ.63,840
                                          మొత్తం పోస్టుల సంఖ్య - 40

ఎంపిక విధానం..

- ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

- ఉత్తీర్ణులైన వారికి మెయిన్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

- త‌రువాత మెరిట్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

TSPSC Application Dates: TSPSC నుంచి విడుదలైన ఈ 2 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశారా.. మరి కొన్ని గంటలే సమయం..

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tscab.org/apex-bank/ ను సంద‌ర్శించాలి.

Step 3 : అనంత‌రం Click here to apply ఆప్ష‌న్‌లోకి వెళ్లాలి.

Step 4 : కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration లోకి వెళ్లాలి.

Step 5 : మీ ఈమెయిల్‌, ఫోన్ నంబ‌ర్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకొవాలి.

Step 6 : ద‌ర‌ఖాస్తు ఫాంను తప్పులు లేకుండా నింపాలి.

Step 7 : అనంత‌రం ప‌రీక్ష ఫీజు రూ.950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీసీల‌కు రూ. 250 ఫీజు చెల్లించాలి.

Step 8 : త‌రువాత స‌బ్‌మిట్ చేయాలి. పూర్త‌యిన త‌రువాత భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం మీ అప్లికేష‌న్ ఫాంను ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.

Step 09 : ద‌ర‌ఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 16, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

RRB Group D Update: గుడ్ న్యూస్.. ఆర్ఆర్ బీ (RRB) Group D పరీక్షల తేదీలు విడుదల..

అయితే ఈ పోస్టులకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ రేపు (సెప్టెంబర్ 28) అందుబాటులో ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ కూడా రేపు ఓపెన్ అవుతుంది.

దరఖాస్తులకు సెప్టెంబర్ 28, 2022 నుంచి అక్టోబర్ 16, 2022 వరకు సమర్పించవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష అనేది నవంబర్ 2022లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://tscab.org/apex-bank/ సందర్శించాలని పేర్కొన్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు