Home /News /jobs /

TELANGANA STATE COMMON POST GRADUATE ENTRANCE TEST TS CPGET ADMIT CARDS RELEASED DOWNLOAD AS MENTIONED HERE VB

Halltickets Released: విద్యార్థులకు అలర్ట్.. ఆ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

Halltickets Released: విద్యార్థులకు అలర్ట్.. ఆ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

Halltickets Released: విద్యార్థులకు అలర్ట్.. ఆ హాల్ టికెట్స్ విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ TS PG ప్రవేశ పరీక్ష 2022ని నిర్వహిస్తుంది. తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) ఆన్‌లైన్ దరఖాస్తులను 2022 జూన్ అండ్ జూలై నెలలో స్వకరించిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ బోర్డ్ TS PG ప్రవేశ పరీక్ష 2022ని నిర్వహిస్తుంది. తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) ఆన్‌లైన్ దరఖాస్తులను 2022 జూన్ అండ్ జూలై నెలలో స్వకరించిన సంగతి తెలిసిందే. ఇటీవల TS CPGET పరీక్ష తేదీలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. తెలంగాణ CPGET పరీక్షలు 11 ఆగస్టు నుండి 23 ఆగస్టు 2022 వరకు నిర్వహించబడుతాయి. ఈ మేరకు నోటీస్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే హాల్ టికెట్స్ మాత్రం ఈ రోజు నుంచి వెబ్ సైట్లో పొందుపరిచారు. వాటిని డౌన్ లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేసి వివరాలను నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Best Interview Tips: ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఈ 4 తప్పులు చేయకండి.. ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం మీదే..


TS CPGET హాల్ టికెట్ 2022ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో వివరంగా తెలుసుకుందాం..

- మొదట అధికారిక వెబ్ సైట్ https://cpget.tsche.ac.in ను సందర్శించాలి.

- ఇక్కడ Download Hall Ticket అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

-దీనిలో రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్ పేపర్ ఏంటనే దానిని ఎంచుకోవాలి.

-చివరగా.. వివరాలను నమోదు చేసి డౌన్ లోడ్ హాల్ టికెట్ పై క్లిక్ చేసి.. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

RRB Group D Admit Cards: రైల్వే గ్రూప్ డీ అభ్యర్థులకు అలర్ట్.. మీ పరీక్ష తేదీ, సిటీ వివరాలను తెలుసుకోండిలా..


కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ మార్పు.. 

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ లో మార్పు చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరంకు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక వేళ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో సర్టిఫికేట్లను అప్ లోడ్ చేసుకోకపోతే.. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 18 వరకు పెండింగ్ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ కు అవకాశం కల్పిస్తామన్నారు. గుర్తింపు పొందని కాలేజీల లిస్ట్ ను ఈ నెల 20, 21 తేదీల్లో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో డిగ్రీ ప్రవేశం కోసం వెబ్‌సైట్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలన్నారు. ఇక డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించేలా విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఆ వివరాలను ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Admit card, Admit cards, Career and Courses, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు