Home /News /jobs /

TELANGANA STATE BOARD OF INTERMEDIATE EDUCATION RELEASED TS INTER HALL TICKETS 2020 KNOW HOW TO DOWNLOAD SS

Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ లింక్ ఇదే

Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ లింక్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ లింక్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Intermediate hall tickets 2020 | తెలంగాణలో మార్చి 4 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ పరీక్షలకు హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

    తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్‌ని విడుదల చేసింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, బ్రిడ్జి కోర్స్ హాల్ టికెట్స్‌ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. వెబ్‌సైట్‌తో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన TSBIE SERVICES యాప్‌లో కూడా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణలో మార్చి 4 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ పరీక్షలకు హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

    Telangana Inter Hall Tickets: ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయండి ఇలా


    ముందుగా https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో Hall Tickets Download సెక్షన్ కనిపిస్తుంది.
    అందులో First Year, Second Year, Bridge Course పేరుతో మూడు ట్యాబ్స్ ఉంటాయి.
    మీరు ఏ పరీక్షకు దరఖాస్తు చేస్తే ఆ ట్యాబ్ క్లిక్ చేయండి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయాలి.
    మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ లేదా ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
    Get Hall Ticket పైన క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ కనిపిస్తుంది.
    హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
    హాల్ టికెట్‌లోని ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
    నేరుగా ఇంటర్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్ని 9,65,839 మంది విద్యార్థులు రాయనున్నారు. వారిలో ఫస్టియర్ విద్యార్థులు 4,80,516, సెకండియర్ విద్యార్థులు 4,85,323 మంది ఉన్నారు. మార్చి 4 నుంచి 18 వరకు ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ పరీక్షల కోసం 1,339 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసింది తెలంగాణ ఇంటర్ బోర్డు. ప్రత్యేక పోర్టల్‌తో పాటు 040-24600110 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Telangana Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి తెలంగాణలో 1466 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

    TS EDCET 2020: తెలంగాణ ఎడ్‌సెట్ 2020... నేటి నుంచి దరఖాస్తులు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, NOTIFICATION, Telangana, Telangana inter board, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు