TELANGANA ST STUDY CIRCLE OFFERS FREE COACHING FOR IBPS JOBS TO ST SC AND BC CANDIDATES HERE FULL DETAILS NS
Free Coaching for IBPS Exams: ఐబీపీఎస్ ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల బ్యాంకు ఉద్యోగాలకు విపరీతమైన పోటీ పెరిగింది. మంచి వేతనంతో పాటు ఉద్యోగ భద్రత ఉండడంతో ఈ ఉద్యోగాల్లో సాధించేందుకు అనేక మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోచింగ్ ల కోసం వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్ (Telangana Study Circle for STs-PETC-Hyderabad) శుభవార్త చెప్పింది. ఐబీపీఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు స్టడీ సర్కిల్ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. Powergrid Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్
అర్హతలు:
-కేవలం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు.
-అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి.
-ఐబీపీఎస్ నోటిఫికేషన్ ప్రకారం వయస్సు 18 ఏళ్లకు పైగా ఉండాలి.
-ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు లేదా వారికి పేరెంట్స్ కు ఏడాదికి రూ.2 లక్షలు, బీసీ అభ్యర్థులకు రూ. 1 లక్ష లోపు వార్షికాదాయం ఉండాలి.
-ఏదైనా ఉద్యోగం చేస్తున్న వారికి, లేదా చదువువుకుంటున్న వారు దరఖాస్తుకు అనర్హులు.
-ఏదైనా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ స్టడీ సర్కిల్ నుంచి ఇంతకు ముందే కోచింగ్ తీసుకున్న వారు అప్లై చేసుకోవడానికి అనర్హులు.
-కేవలం తెలంగాణకు చెందిన అభ్యర్థులు మాత్రమే శిక్షణకు అర్హులు.
-ఐబీపీఎస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న వారు మాత్రమే శిక్షణకు అర్హులు.
సీట్ల కేటాయింపు..
ఎస్టీ అభ్యర్థులకు 75 శాతం, ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, బీసీ అభ్యర్థులకు 10 శాతం సీట్లను కేటాయించనున్నారు. మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ఉంటుంది. స్కీనింగ్ టెస్ట్/మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.
అప్లై చేసే సమయంలో జాగ్రత్తలు:
-దరఖాస్తులో అభ్యర్థుల ఫొటో సరిగా లేకుంటే రిజక్ట్ చేస్తారు.
-అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో కమ్యూనిటీ, నేటివిటీ సర్టిఫికేట్, ఇన్ కం సర్టిఫికేట్, టెన్త్ మార్క్స్ మెమో, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్లు, చివరి విద్యార్హతకు సంబంధించిన టీసీ సర్టిఫికేట్ స్కానింగ్ కాపీని అటాచ్ చేయాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఏదైనా సందేహాలుంటే 040-27540104 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.