Home /News /jobs /

TELANGANA ST STUDY CIRCLE OFFERS FREE COACHING FOR BANK JOBS ASPIRANTS HERE DETAILS NS

Bank Jobs: బ్యాంక్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఫ్రీ కోచింగ్ కోసం ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ఎస్టీ స్డడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి భారీగా బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత బ్యాంకు ఉద్యోగాలకు అత్యధికంగా యువత పోటీ పడుతూ ఉంటారు. ఇందుకోసం వేలకు వేలు చెల్లించి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సామాన్యులకు ఈ మొత్తంలో ఫీజు చెల్లించడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ ఎస్టీ స్టడీ సర్కిల్ (ST Study Circle) శుభవార్త చెప్పింది. వారికి ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ కోచింగ్ కు ప్రిపేర్ అవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించారు.

    స్క్రీనింట్ టెస్ట్ లేదా అర్హత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    TS Police Jobs: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తారా? తాజా అప్డేట్స్ ఇవే..

    ముఖ్యమైన తేదీలు:
    నోటిఫికేషన్ విడుదల: జులై 14
    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 25
    ఎంపికైన వారి జాబితా ప్రకటన: ఆగస్టు 1
    అడ్మిషన్ డేట్ (ధ్రువపత్రాల వెరిఫికేషన్):  ఆగస్టు, 03
    కోచింగ్ క్లాసుల ప్రారంభం: ఆగస్టు 5


    ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా https://studycircle.cgg.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Tribal Welfare Department ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    Step 3: హోం పేజీలో మీకు Apply Online ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 4: అక్కడ కావాల్సిన పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bank Jobs, Free coaching, IBPS, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు