TS SSC Exam | PUBG పేరు, ఫొటోతో విద్యార్థికి హాల్ టికెట్...

పదో తరగతి పరీక్షల హాల్ టికెట్ మీద ఏకంగా PUBG ఫొటోను ముద్రించారు. అంతేకాదు, విద్యార్థి పేరు చివరన PUBG తగిలించారు.

news18-telugu
Updated: March 18, 2020, 5:17 PM IST
TS SSC Exam | PUBG పేరు, ఫొటోతో విద్యార్థికి హాల్ టికెట్...
SSC పరీక్షల హాట్ టికెట్ మీద PUBG ఫొటో
  • Share this:
అప్పుడప్పుడు ఎన్నికల ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. పెద్దల పేర్లు, పిల్లల ఫొటోలు, సినిమా హీరోల పేర్లు, ఫొటోలు, సినిమా పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే, తెలంగాణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం అంతకు మించిపోయింది. విద్యార్థుల జీవితానికి మలుపులాంటి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్ మీద ఏకంగా PUBG ఫొటోను ముద్రించారు. అంతేకాదు, విద్యార్థి పేరు చివరన PUBG తగిలించారు. అంతటితో ఆగిపోలేదు. ఏకంగా విద్యార్థి తండ్రి పేరు చివరన PUBG Lite అని జోడించారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌లోని షాలిబండకు చెందిన హిదాయత్ అనే విద్యార్థి ‘S ది స్కూల్’ అనే పాఠశాలలో చదువుకున్నాడు. ఆ విద్యార్థిని రోల్ నెంబర్ 2022114399. సదరు స్టూడెంట్‌కు సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ పేరు, ఏయే రోజు ఏయే పరీక్షలు ఉన్నాయనే వివరాలతో హాల్ టికెట్ ఇంటికి వచ్చింది. అయితే, అందులో విద్యార్థి ఫొటో ఉండాల్సిన చోట PUBG ఫొటో ఉంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ హాల్ టికెట్‌ను కన్ ఫాం చేసుకోవడానికి న్యూస్‌18 తెలుగు ప్రయత్నించింది. ఆ హాల్ టికెట్ మీద ఉన్న వివరాలను తెలంగాణ విద్యాశాఖ వెబ్‌సైట్‌లో చెక్ చేసింది. అక్కడ కూడా అదే చిత్రం కనిపించింది.
First published: March 18, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading