కాలేజీలు(Colleges), పాఠశాలు(Schools) ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. పది, ఇంటర్ ఫలితాల(Inter Results) కోసం విద్యార్థులు(Students) ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పది ఫలితాల(Tenth Results)విడుదలకు విద్యాశాఖ అధికారుల నుంచి స్పష్టత వచ్చింది. పది పరీక్షా(Exam) ఫలితాలను జూన్ 25న విడుదల(Release) చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో పదో తరగతి(Tenth Class) వార్షిక పరీక్షలు గత నెల 23 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ క్రమంలో జూన్ 25న టెన్త్ ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ సారి కూడా పదో తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 2011 నుంచి రాష్ట్రంలో గ్రేడింగ్ విధానాన్నే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందు కు ఈ గ్రేడింగ్ విధానాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు. అయితే ఏపీలో గ్రేడింగ్ విధానాన్ని తీసేసి మార్కుల ద్వారా ఫలితాలను ప్రకటిస్తుండటంతో తెలంగాణలో ఈసారి ఫలితాలు ఎలా ప్రకటిస్తారనే దానిపై చర్చ జరిగింది.
ఈ క్రమంలోనే తెలంగాణలో గ్రేడింగ్ విధానంలోనే ఫలితాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ పదో తరగతి పరీక్షలు మే 23న ప్రారంభమై జూన్ 1న ముగిశాయి. మొత్తం 5,08,143 మంది విద్యార్థుల్లో దాదాపు 5.03 లక్షలకు పైగా విద్యార్థులు పది పరీక్షలు రాశారు.
ఇక ఇంటర్ పరీక్ష ఫలితాల విషయానికి వస్తే.. ఇంటర్ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 24తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియలో వేగం పెంచి.. అవి కూడా ముగింపుకు చేరాయి. రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ఈ ఏడాది కొత్తగా మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలను కూడా జూన్ 21 నుంచి 25 మధ్యలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, SSC results, Students, Telangana