Home /News /jobs /

TELANGANA SSC RESULT 2022 TELANGANA TENTH RESULTS RELEASED CHECK YOUR RESULTS WITH THIS LINKS NS

TS 10th Results Direct Link: తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. 10 సెకండ్లలో మీ రిజల్ట్ తెలుసుకోండిలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అభ్యర్థులు సింపుల్ గా తమ రిజల్ట్స్ తెలుసుకోవడానికి ఈ లింక్స్ పై క్లిక్ చేయండి.

    తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు (TS Tenth Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు. విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థుల కోసం న్యూస్18 సైతం ఫలితాలను అందించే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్ సైట్లోనూ సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఈ సారి మొత్తం 5,04,398 మంది అభ్యర్థులు ఈ సారి టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,04,579 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా.. ప్రైవేటు అభ్యర్థులు 819 మంది ఉన్నారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థుల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలికల్లో 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. బాలురు 87.61 శాత ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో కేవలం 51.89 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.

    టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. అయితే.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్ నిర్వహించారు అధికారులు. సిలబస్ ను సైతం 30 శాతానికి తగ్గించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

    News18 Telugu వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవడం ఇలా..

    Step 1: ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

    Step 2: హోమ్ పేజీలో తెలంగాణ టెన్త్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి.

    Step 3: హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

    Step 4: స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.

    Step 5: రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.

    బోర్డ్ వెబ్ సైట్లో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

    Step 1: అభ్యర్థులు మొదటగా  అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి.

    Step 2: అనంతరం హోం పేజీలో టెన్త్ రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

    Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 10th class results, JOBS, SSC results, TS 10th Exams 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు