ప్రైవేట్ స్కూల్ హాస్టళ్లలో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వారంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాంటి వారు తమ సొంత ప్రాంతాల్లోనే పదో తరగతి పరీక్షలు రాసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా విద్యార్థుల వివరాలను సంబంధిత స్కూల్ యాజమాన్యాలు డీఈవోలకు పంపించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒకవేళ 8వ తేదీ నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు హాజరుకాలేకపోతున్న విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, మరి వారిని రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, దీనిపై ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకుని కోర్టుకు విన్నవిస్తామని సర్కారు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. మార్చి 19న తెలంగాణలో టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా, జూన్ 8 నుంచి జులై 5 వరకూ పరీక్షలు నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది.
జూన్ 8న ఇంగ్లీష్ పేపర్-1
11న ఇంగ్లీష్ పేపర్-2
14న మ్యాథ్స్ పేపర్-1
17న మ్యాథ్స్ పేపర్-2
20న సైన్స్ పేపర్-1
23న సైన్స్ పేపర్-2
26న సోషల్ స్టడీస్ పేపర్-1
29న సోషల్ స్టడీస్ పేపర్-2
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.