తెలంగాణలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్. తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ (Telangana 10th Exams) కూడా మారింది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సవరించింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించింది. మే 23 నుంచి జూన్ 1 వరకు తెలంగాణ టెన్త్ పరీక్షలు (TS 10th Exams) జరగనున్నాయి. ఎస్ఎస్సీ, ఓఎస్ఎస్సీ, వొకేషనల్, రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థుల కోసం ఈ షెడ్యూల్ ప్రకటించింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 11 నుంచి మే 20 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం మే 23 నుంచి జూన్ 1 మధ్య తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతాయి.
గత రెండేళ్లులో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసింది. ఈసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గడంతో పరీక్షల్ని నిర్వహిస్తోంది. సాధారణంగా హిందీ తప్ప మిగతా సబ్జెక్ట్స్ రెండు పేపర్స్ ఉంటాయి. ఈసారి అన్ని సబ్జెక్ట్స్కి ఒకే పేపర్తో ఎగ్జామ్స్ నిర్వహించనుంది ఎస్ఎస్సీ బోర్డు. పరీక్ష తేదీలు ఇవే.
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే...
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్ ఏ... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 24- సెకండ్ లాంగ్వేజ్... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 25- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 26- మ్యాథమెటిక్స్... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 27- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 28- సోషల్ స్టడీస్... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 30- ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
మే 31- ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
జూన్ 1- ఎస్ఎస్సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)... ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.