కరోనా నేపథ్యంలో గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా అధికారులు టెన్త్ ఎగ్జామ్స్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పరీక్షలను రద్దు చేస్తున్న సమయంలో విద్యార్థులకు మార్కులను కేటాయించే విధానం సరిగా ఉండడం లేదన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు వార్షిక పరీక్షల నిర్వహణలో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT)తో ప్రభుత్వ పరీక్షల విభాగం(SSC Board) అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సీబీఎస్ఈ బోర్డు ప్రకటించినట్లుగా రాష్ట్రంలోనూ ఏడాదికి రెండు సార్లు పరీక్షలు జరిపే అంశంపై అధికారులు చర్చించనున్నారు. ఇంకా ఫార్మెటివ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాలు రాష్ట్రం మొత్తం ఒకేలా ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. ICSE, ISC Results: రేపే టెన్త్, ఇంటర్ ఫలితాలు.. వెల్లడించిన CISCE.. పూర్తి వివరాలివే Andhra Pradesh: ఏపీలో కొత్త తరహా స్కూళ్లు.., విద్యావిధానంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..
తద్వారా విద్యార్థులకు వెయిటేజీ ఇవ్వడంలో శాస్త్రీయత ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే.. నవంబర్, డిసెంబర్ నాటిని క్లాస్ రూం బోధన సాధ్యం కాకపోతే ఇళ్ల నుంచే ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. అయితే.. రాష్ట్రంలో ఇది సాధ్యమవుతుందా? లేదా? అన్న సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది. అయితే మరి కొన్ని రోజుల్లోనే ఈ అన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. వెలగపూడి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 5లక్షల 19వేల 510 మంది విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను వెబ్ సైట్లో ఉంచినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు http://results.bie.ap.gov.in/, http //results.apcfss.ac.in , https://bie.ap.gov.in/ వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని వెల్లడించారు.
విద్యార్థులు వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం జనరల్, ఒకేషనల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడ హాల్ టికెట్ నెంబర్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేస్తే వారికి సంబంధించిన గ్రేడ్లు చూసుకోవచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను రద్దు చేసి సెకండ్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.