Home /News /jobs /

TELANGANA SOCIAL AND TRIBAL WELFARE RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS SOCIETY INVITES APPLICATIONS FOR ADMISSIONS IN 1ST YEAR INTERMEDIATE SS

Intermediate: గురుకులాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌కు నోటిఫికేషన్

Intermediate Admission: గురుకులాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌కు నోటిఫికేషన్
(ప్రతీకాత్మక చిత్రం)

Intermediate Admission: గురుకులాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌కు నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

TSWREIS TTWREIS Intermediate Admissions 2020 | సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలు, కోర్సులు, సీట్ల వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

    టెన్త్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. పదవ తరగతి పాసైన తర్వాత తెలంగాణలోని గురుకుల కాలేజీల్లో ఇంటర్ చదవాలనుకుంటే ఇప్పుడే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ సోషల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-TSWREIS, తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-TTWREIS వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలు, కోర్సులు, సీట్ల వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

    TSWREIS TTWREIS Intermediate Admissions 2020: ముఖ్యమైన తేదీలు


    నోటిఫికేషన్ విడుదల- 2019 నవంబర్ 27
    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 నవంబర్ 28
    దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 20
    హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2019 డిసెంబర్ 25 నుంచి
    TSWREIS ఎంట్రెన్స్ టెస్ట్ లెవెల్ 1- 2020 జనవరి 5
    TSWREIS ఎంట్రెన్స్ టెస్ట్ లెవెల్ 2- 2020 ఫిబ్రవరి 9
    TTWREIS ఎంట్రెన్స్ టెస్ట్ లెవెల్ 1- 2020 జనవరి 12
    TTWREIS ఎంట్రెన్స్ టెస్ట్ లెవెల్ 2- 2020 ఫిబ్రవరి 16
    ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల- 2020 మార్చి 30
    2020-2021 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు- 2020 జూన్ 1

    TSWREIS TTWREIS Intermediate Admissions 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హత- 2020 మార్చిలో ఎస్ఎస్‌సీ పబ్లిక్ ఎగ్జామ్, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ సిలబస్‌తో 10 వ తరగతి రాసే విద్యార్థులు అర్హులు.
    2020 మార్చిలో ఎస్ఎస్‌సీలో A1 నుంచి B2 వరకు గ్రేడ్ పొందినవారు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు.
    తల్లిదండ్రుల వార్షికాదాయం అర్బన్ విద్యార్థులకు రూ.2,00,000 లోపు, రూరల్ విద్యార్థులకు రూ.1,50,000 లోపు ఉండాలి.
    తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు ఎంట్రెన్స్ టెస్ట్ రాయొచ్చు.
    విద్యార్థుల వయస్సు 2020 ఆగస్ట్ 31 నాటికి 17 ఏళ్లు మించకూడదు. ఎస్సీ విద్యార్థులు, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు వయస్సులో 2 ఏళ్లు సడలింపు ఉంటుంది.

    తెలంగాణ సోషల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-TSWREIS నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-TTWREIS నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Realme X2 Pro: తక్కువ ధరకే రానున్న రియల్‌మీ ఎక్స్‌2 ప్రో... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: రైల్వే జాబ్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్... ఎందుకో తెలుసా?

    Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

    SSC Jobs: 1,578 ఎస్ఐ పోస్టుల్ని ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, EDUCATION, NOTIFICATION, Ssc exams, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు