Home /News /jobs /

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారీగా వేతనం.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారీగా వేతనం.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో పల్మనాలజిస్ట్, అనెస్థెటిస్ట్, హెల్త్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన వారు కొత్త‌గూడెం, రామ‌గుండం, రామ‌కృష్ణాపూర్‌, భూపాల‌ప‌ల్లిలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కు చెందిన హాస్పటల్స్, కోవిడ్ వార్డులో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.
    Railway Recruitment 2021: సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. పూర్తి వివరాలివే
    DRDO Recruitment 2021: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    ఖాళీల వివరాలు..
    మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ఇందులో ప‌ల్మ‌నాల‌జిస్ట్ విభాగంలో 4, అనెస్థెటిస్ట్ విభాగంలో మరో 4, హెల్త్ ఆఫీసర్ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో పీజీ చేసిన వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.
    Official Website - Direct Link

    ఇతర వివరాలు..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు థార్డ్ ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, లక్డికపూల్, హైదరాబాద్ చిరునామాలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 1.25 లక్షల వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Government jobs, Singareni, Singareni Collieries Company, Telangana government jobs

    తదుపరి వార్తలు