Home /News /jobs /

TELANGANA SINGARENI COLLIERIES LIMITED JOB NOTIFICATION RELEASED HERE IMPORTANT DETAILS NS

Telangana Singareni Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త.. సింగరేణిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సింగరేణి యాజమాన్యం (Singareni Collieries Company) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

    తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర (Telangana Government Jobs) కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. టెట్ ఎగ్జామ్స్ (TET Exams) ను సైతం ఇటీవల విజయవంతంగా నిర్వహించారు అధికారులు. తాజాగా సింగరేణి యాజమాన్యం (Singareni Collieries Company) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 177 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎక్స్‌‌టర్నల్‌ క్లర్కు పోస్టుల విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుకు జులై 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు www.scclmines.com వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ ను www.scclmines.com వెబ్ సైట్లో ఒకటి రెండు రోజుల్లో అందుబాటులో తీసుకువచ్చే అవకాశం ఉంది.

    ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు కనీస బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌/ఐ.టీ ఒక సబెక్టుగా ఉన్నవారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ట వయసు 30 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ఐదు ఏళ్ల మినహాయింపు ఉంటుంది.
    TS Govt Jobs 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. 1,326 పోస్టుల‌తో ఆ శాఖ‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల‌

    ఇంకా.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ ఖాళీలను 95శాతం లోకల్‌ అభ్యర్థులతో అంటే ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన వారితో భర్తీ చేయనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులు అన్‌ రిజర్వుడు కోటాకింద ఓపెన్‌ టు ఆల్‌ కింద భర్తీ చేయనున్నారు. ఇంకా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్షనిర్వహించనున్నారు. రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Singareni, Singareni Collieries Company, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు