హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS SI Exam: టెన్షన్ పడొద్దు.. అలా చేయండి.. పోలీస్ అభ్యర్థులకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచనలు

TS SI Exam: టెన్షన్ పడొద్దు.. అలా చేయండి.. పోలీస్ అభ్యర్థులకు ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచనలు

సజ్జనార్ (ఫైల్ ఫొటో)

సజ్జనార్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 7న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించి ఆగస్టు 7న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు (TS SI Exam) దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు చేశారు. ఇంకా రాష్ట్రంలోని మరో 35 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB). దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రిలిమ్స్ పరీక్షలో ఈ సారి నెగెటివ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అభ్యర్థులు తప్పు సమాధానానికి 0.25 మార్కులను కోల్పోతారు. దీంతో అభ్యర్థుల్లో కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది. 60 మార్కులు సాధించిన వారు ఫిజికల్ టెస్ట్ కు అనుమతించబడుతారు. ఆ టెస్ట్ లో అర్హత సాధించిన వారు తుది రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

TS SI Preliminary Exam: మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ పోలీస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘గమ్యాన్ని ఇష్టపడి మార్గం కష్టమైనా చేరుకుంటాం. కానీ గమ్యం చేరాక ఆ మార్గాన్నే ఎక్కువ ఇష్టపడతాం. ఎగ్జామ్స్ ఆ మర్గంలోని భాగాలే.. ఈ మార్గాన్ని ప్రతీ క్షణం ఎంజాయ్ చేయడం, టెన్షన్ పడొద్దు. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఇంకా తెలంగాణ పోలీసులు సైతం ట్విట్ ద్వారా అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

First published:

Tags: JOBS, Police jobs, Sajjanar, Telangana police jobs

ఉత్తమ కథలు