Home /News /jobs /

TELANGANA SCHOOLS LIKELY TO BE REOPENED NEXT WEEK GOVERNMENT WAS PLANNING TO HOLD SSC EXAMINATIONS AS PER SCHEDULE SU

Telangana Schools: త్వరలోనే తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్‌..! ఎప్పటి నుంచి అంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

10వ తరగతి పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు అధికారులు చర్చలు జరుపుతున్నారు.

    విద్యారంగంపై కరోనా తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఇటీవల రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మరోసారి తెలంగాణలో విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకన్న సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై భయాందోళనలు నెలకొన్నాయి. విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. అధికారులు ఇంతకు ముందు మాదిరిగానే ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. అయితే ఆన్‌లైన్ తరగుతుల ద్వారా విద్యను అభ్యసించడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు ప్రకటించిన ప్రభుత్వం.. స్కూల్స్ మూసివేసిన సమయంలో పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇవ్వకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అనిశ్చితి నెలకొంది.

    అయితే ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డ్ రెండు రోజుల క్రితం ఓ క్లారిటీ ఇచ్చింది. మే 1నుంచి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేసింది. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేసే ఆలోచన ఏమీ లేదంటూ తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1, 3 వ తేదీల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలను అసైన్మెంట్ల రూపంలో నిర్వహించనున్నారు. అయితే విద్యాసంస్థలు మూసి ఉండడంతో విద్యార్థులు ఈ రెండు పరీక్షలను ఇంటి వద్దే రాసి వారి కళాశాలల్లో సమర్పించాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ తెలిపారు. అయితే ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలు మాత్రం వాయిదా పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.

    ఇక, తాజాగా పదో తరగతి పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో వచ్చే వారం పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని అనకుంటున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయని Deccan Chronicle పేర్కొంది. ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఈ రకమైన ఆలోచన చేసినట్టు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. ఇక, మే 17 నుంచి 26 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: 10th Class Exams, Coronavirus, Schools reopening, Telangana, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు