హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Schools: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రాంతంలో సెలవుల కొనసాగింపు.. వివరాలివే

TS Schools: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ ప్రాంతంలో సెలవుల కొనసాగింపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు గత వారం అంతా ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులు ముగియడడంతో ఈ రోజు అంటే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను ప్రారంభించింది ప్రభుత్వం.

  తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు గత వారం అంతా ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవులు ముగియడడంతో ఈ రోజు అంటే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను ప్రారంభించింది ప్రభుత్వం. అయితే.. కొన్ని చోట్ల ఇంకా వరదలు తగ్గకపోవడంతో సెలవులను కొనసాగిస్తోంది కేసీఆర్ సర్కార్. తీవ్ర వరదకు గురైన భద్రాచలం ప్రాంతంలోని పలు గ్రామాల్లో సెలవులను కొనసాగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే.. ఉపాధ్యాయులు మాత్రం స్కూళ్లకు హాజరై పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో వరదల ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడంతో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

  ఇదిలా ఉంటే.. గోదావరి నది ఉగ్రరూపంతో అతలాకులమైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. వరదల కారణంగా సంభవించిన నష్టం, ముంపు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా పరీశీలించారు. ఆదివారం ఉదయం హన్మకొండ నుంచి కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలానికి చేరుకున్నారు. గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను బ్రిడ్జిపై నుంచి ప‌రిశీలించారు సీఎం కేసీఆర్. అక్కడ గంగమ్మ తల్లికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు చేసి పసుపు, కుంకుమలు చల్లి సారె, సమర్పిచారు. కరకట్టను పరిశీలించిన సీఎం దాని పటిష్టత కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచించారు.

  వరద బాధితులకు పరామర్శ..

  అటుపై భద్రాచలం జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న వరద బాధితుల్ని పరామర్శించారు. వారికి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీల నిర్మాణం చేపడతామన్నారు. భద్రాచలం సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులు, ముంపు సమస్యలన్నింటి కోసం రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Floods, Hyderabad Floods, Kcr

  ఉత్తమ కథలు