హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

నిరుద్యోగులకు శుభవార్త.. Bank, SSC, RRB జాబ్స్ కు ఫ్రీ కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. Bank, SSC, RRB జాబ్స్ కు ఫ్రీ కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. బ్యాంకు ఉద్యోగలతో పాటు SSC, RRB ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

నేటి యువత ప్రైవేటు ఉద్యోగాల (Private Jobs) కన్నా.. ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs)  వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జాబ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తర్వాత అత్యధికంగా పోటీ ఉన్న ఉద్యోగాలు బ్యాంకు జాబ్స్ (Bank Jobs) అనే చెప్పొచ్చు. మంచి వేతనాలు, ఉద్యోగ భద్రత ఉండడంతో ఈ ఉద్యోగాల(Jobs) కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. డిగ్రీ పూర్తవగానే యువత ఈ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు. సొంతంగా ప్రిపేర్ అవ్వడం కాన్నా కూడా శిక్షణ తీసుకుంటే త్వరగా ఈ ఉద్యోగాలను సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ షెడ్యూల్ కాస్ట్స్ స్టడీ సర్కిల్ (TSSC Study Circle) బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది.

వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఉద్యోగాలతో పాటు SSC, RRB జాబ్స్ కు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30 వ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

NHPC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. NHPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామ్ నిర్వహించి ఎంపిక చేస్తారు. పరీక్ష 100 మార్కులకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. ఇందులో 55 మార్కులు జనరల్ స్టడీస్ (General Studies), మరో 45 మార్కులు జనరల్ అబిలిటీ (General Ability)కి ఉంటాయి. జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ మరియు తెలంగాణ హిస్టరీ, భౌగోళిక శాస్త్రం, ఇండియన్ పాలిటీ మరియు గవర్నెన్స్, ఇండియన్, స్టేట్ ఎకానమీ ఉంటాయి. జనరల్ స్టడీస్ విషయానికి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సోషల్ ఎక్స్లూజన్ తదితర సబ్జెక్టులు ఉంటాయి.

AP Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో D-Mart, Khazana Jewelleryలో ఉద్యోగాలు.. రూ. 18 వేల వరకు వేతనం.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ఎంట్రెన్స్ ఎగ్జామ్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఎగ్జామ్ ను డిసెంబర్ 5వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలోనే పరీక్ష రాయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

NTPC Recruitment 2021: ఇంజనీరింగ్ అభ్యర్థులకు NTPCలో రూ. 60 వేల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

ఎంపిక ప్రక్రియ: పరీక్షకు హాజరైన అభ్యర్థులను ప్రతిభ ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. 75 శాతం ఎస్సీలు, ఎస్టీలు 10 శాతం, బీసీలకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. ఇందులో 33 శాతం మహిళలకు, 5 శాతం దివ్యాంగులకు అవకాశం ఉంటుంది.

అర్హతలు:

-బీఏ/బీకాం/బీఎస్సీ తో పాటు బీటెక్/బీఫార్మ్, బీఎస్సీ(Ag) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉచిత కోచింగ్ కు అప్లై చేసుకోవచ్చు.

-కుటుంబ వార్షికాదాయం రూ. 3 లక్షలకు మించకూడదు.

-రెసిడెన్షియల్ విధానంలో ఈ శిక్షణ ఉంటుంది. కాబట్టి.. ఉద్యోగం చేస్తున్న వారు దరఖాస్తుకు అనర్హులు. 2020-21లో ఏదైనా కోర్సు చదువులున్న వారు ఈ శిక్షణకు అర్హులు.

-అభ్యర్థులు గతంలో ప్రభుత్వ సహాయంతో ఎలాంటి శిక్షణ పొంది ఉండ కూడదు.

-గతంలో స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందిన వారు కూడా దరఖాస్తుకు అనర్హులు.

TCIL Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. TCILలో అప్రంటీస్ ఖాళీలు.. ఇలా అప్లై చేయండి


ఎలా అప్లై చేసుకోవాలంటే..

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం నోటిఫికేషన్స్ విభాగంలో Apply Online అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

Step 3: అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ లో పేరు, ఇంటి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, కులం, చిరునామా, విద్యార్హతల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

Step 4: అప్లికేషన్ ఫామ్ లో టెన్త్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్ కం సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్ స్కాన్ కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Step 5: అనంతరం సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.


అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


అప్లికేషన్ ఫామ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శిక్షణ ఎక్కడ అంటే..

తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్ కు రాష్ట్రంలో నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో మొత్తం 11 బ్రాంచులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఈ జిల్లాల్లో డిసెంబర్ 15 నుంచి మే 15 వరకు ఉచిత శిక్షణ ఉంటుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Bank Jobs, Bank Jobs 2021, Career and Courses, Central Government Jobs, Job notification

ఉత్తమ కథలు