Home /News /jobs /

TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD INVITES APPLICATIONS FOR 34 PRINCIPAL POSTS IN TSWREIS AND TTWREIS WOMEN DEGREE COLLEGES SS

Telangana Jobs: తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Telangana Jobs: తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs: తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Gurukul Degree College Recruitment 2020 | తెలంగాణలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళల డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-TSWREIS, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ-TTWREIS ఆధ్వర్యంలోని మహిళల డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-TREIRB ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరుగుతోంది. దరఖాస్తు గడువును 2020 మార్చి 30 వరకు పొడిగించారు. మొదట తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 19 ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో పాటు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలకు 15 ప్రిన్సిపాల్ పోస్టుల్ని కేటాయిస్తూ మరో నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా 15 పోస్టుల్ని చేర్చినందు వల్ల దరఖాస్తు గడువును పెంచింది రిక్రూట్‌మెంట్ బోర్డు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://treirb.telangana.gov.in/ లేదా https://www.treirb.net/ వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.

    Telangana Gurukul Degree College Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ప్రిన్సిపాల్ పోస్టులు- 34
    TSWREIS డిగ్రీ కాలేజీలు- 19
    TTWREIS డిగ్రీ కాలేజీలు- 15
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 30 సాయంత్రం 5 గంటలు
    విద్యార్హత- 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. పీహెచ్‌డీ ఉండాలి.
    అనుభవం- తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా లేదా 5 ఏళ్లు లెక్చరర్‌గా లేదా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో 7 ఏళ్లు లెక్చరర్‌గా లేదా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 7 ఏళ్లు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా లేదా యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కళాశాలల్లో 7 ఏళ్లు అకడమిక్ కన్సల్టెంట్‌గా లేదా 5 ఏళ్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్ ప్రిన్సిపాల్‌గా లేదా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7 ఏళ్లు జూనియర్ లెక్చరర్‌గా లేదా ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 9 ఏళ్లు రెగ్యులర్ జూనియర్‌ లెక్చరర్‌గా లేదా ప్రభుత్వ జూనియర్ కళాశాల్లోల 9 ఏళ్లు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
    వయస్సు- 34 నుంచి 44 ఏళ్లు
    దరఖాస్తు ఫీజు- రూ.2,000. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.1,200.
    దరఖాస్తు విధానం- అభ్యర్థులు TREIRB వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొని, ప్రింట్ తీసి, అన్ని డాక్యుమెంట్స్‌ జత చేసి దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    Chairman, Telangana Residential Educational Insitutions Recuitment Board,
    4th Floor, D.S.S Bhavan, Masab Tank,
    HYDEABAD - 500028.

    తెలంగాణలోని గురుకుల మహిళల డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    పోస్టుల్ని పెంచుతూ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత

    Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు

    UPSC Jobs 2020: యూపీఎస్‌సీ నుంచి 886 పోస్టుల భర్తీ... అప్లై చేయండిలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు