TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTION SOCIETY ONCE AGAIN EXTENDS APPLICATION LAST DATE FOR TSRJC CET 2020 UP TO SEPTEMBER 5 KNOW ALL DETAILS SS
TSRJC CET 2020: టీఎస్ఆర్జేసీ సెట్ వాయిదా... ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు
TSRJC CET 2020: టీఎస్ఆర్జేసీ పరీక్ష వాయిదా... ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)
TSRJC CET 2020 exam date | తెలంగాణ గురుకుల కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం నిర్వహించే TSRJC CET 2020 పరీక్షకు దరఖాస్తు గడువు మరోసారి పెరిగింది.
తెలంగాణలో 10వ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఇంకా అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 రాయడానికి ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ పరీక్షకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువు గతంలోనే ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అప్లికేషన్ డెడ్‌లైన్‌ను పొడిగించింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ-TREIS. ఇప్పుడు మరోసారి దరఖాస్తు గడువును పెంచింది. ఆసక్తి గల విద్యార్థులు 2020 సెప్టెంబర్ 5 వరకు టీఎస్ఆర్జేసీ సెట్ 2020 కి అప్లై చేయొచ్చు. ఇక పరీక్షను కూడా వాయిదా వేసింది TREIS. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 మే 10న జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ ఎగ్జామ్ వాయిదా పడింది. ఇప్పటికీ పరీక్ష నిర్వహంచే అవకాశం లేదు కాబట్టి దరఖాస్తు చేయడానికి విద్యార్థులకు మరో అవకాశం ఇస్తోంది TREIS. టెన్త్ పాసైన విద్యార్థులు గురుకుల కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం అప్లై చేయొచ్చు. TSRJC CET 2020 ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి. మొత్తం 35 కాలేజీల్లో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు.
టెన్త్ విద్యార్థులు TSRJC CET 2020 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.