హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Groups Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు?

Telangana Groups Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రూప్-1లో 503, గ్రూప్-2లో 582, గ్రూప్ 3 లో 1,373, గ్రూప్ 4 లో 9,168 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటయి? ఏ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు? అన్న అంశంపై అనేక మందిలో గందరగోళం ఉంది.

ఇంకా చదవండి ...

తెలంగాణలో త్వరలోనే కొలువుల జాతర (Telangana Government Jobs) మొదలు కానుంది. రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. గ్రూప్స్ ఉద్యోగాల కోసం అత్యధికంగా నిరుద్యోగులు పోటీ పడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రూప్-1లో 503, గ్రూప్-2లో 582, గ్రూప్ 3 లో 1,373, గ్రూప్ 4 లో 9,168 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటయి? ఏ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు? అన్న అంశంపై అనేక మందిలో గందరగోళం ఉంది. అయితే.. కేవలం గ్రూప్1, గ్రూప్ 2 పోస్టులకు మాత్రమే మౌఖిక ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ రెండు విభాగాల్లోని ఖాళీలకు మొదట రాత పరీక్ష నిర్వహించి.. అందులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

గ్రూప్ 1 ద్వారా సబ్ కలెక్టర్, ఆర్టీఓ, డిఎస్పీ, జిల్లా రిజిస్టార్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డీపీఓ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 2లో ప్రధానంగా కమిషనర్ గ్రేడ్-3, ఏసీటీఓ, సబ్ రిజిస్టార్ గ్రేడ్-3, పంచాయతీరాజ్ విస్తరణాధికారి, ఎక్సైజ్ ఎస్ఐ, సబ్ రిజిస్టార్ తదితర ఖాళీలు ఉండనున్నాయి.

TSPSC Group-III: తెలంగాణలో 1,373 గ్రూప్-III ఖాళీలు.. త్వరలోనే నోటిఫికేషన్.. సిలబస్, పరీక్షా విధానం ఇదే

ఇంజ‌నీరింగ్ పోస్టుల‌కు సంబంధించి ముఖ్యంగా అన్ని సివిల్ ఇంజినీరింగ్ జాబ్స్ భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు ఎక్కువ‌గా ఉండే నీటిపారుదల, రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, ప్రజారోగ్య శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖ‌ల్లోని పోస్టుల‌కు వేర్వేరుగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల స‌మ‌యం వృథా అవుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అంతేకాకుండా రెండు మూడు విభాగాల‌కు ఎంపికైన వారి వ‌ల్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయే అవ‌కాశం ఉంద‌ని భావిస్తోంది.

ఈ నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల‌కు క‌లిపి ఒకే ప‌రీక్ష నిర్వ‌హిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం అధికార వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతుంది. ఇటీవ‌ల ఉద్యో గాల భర్తీ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో ఒకే ప‌రీక్ష అంశంపై సుముఖంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ ఐదుశాఖ‌ల్లో 2,000 ఇంజనీరింగ్ పోస్టులు ఉన్న‌ట్టు గుర్తించారు.

First published:

Tags: Job notification, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు