Home /News /jobs /

TELANGANA PRIVATE TEACHERS WILL GET RS 2000 FINANCIAL ASSISTANCE FROM APRIL ONWARDS SU

Telangana: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం.. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారంటే..

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రులు

రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్‌ నుంచే సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

    విద్యాసంస్థలను మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు స్కూల్ టీచర్లను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూ. 2 వేల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్.. రాష్ట్రంలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అందిస్తామన్న సాయంపై సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఏప్రిల్‌ నుంచే సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించారు.

    దాదాపు 1.45లక్షల మంది ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని మంత్రులు అంచనా వేశారు. వారికి సాయం కోసం నెలకు రూ.42కోట్లు అవసరమవుతాయని అధికారులు మంత్రులకు తెలిపారు. ఇక, ఏప్రిల్ 10 నుంచి 15 మధ్య లబ్ధిదారుల డేటాను అప్‌లోడ్ చేయాలని.. ఏప్రిల్ 16 నుంచి 19 వరకు పరిశీలన, ఫిర్యాదుల పరిష్కారం జరుగుతుందన్నారు. ఇక, ఏప్రిల్ 20 నుంచి 24 వరకు రూ .2,000 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బియ్యం కూడా లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. రేషన్‌ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రుల సూచించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లును మంత్రులు ఆదేశించారు.

    Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందా?.. ప్రతి ఏడాది డోసులు తీసుకోవడం తప్పనిసరా?

    దీని ప్రకారం పాఠశాలలు తిరిగి తెరిచే వరకు వారికి రూ. 2000 సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా సరఫరా చేయనున్నారు. ఇప్పటికే సర్కారు అందించే ఈ సాయం పొందడం కోసం ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు, ఇతర సిబ్బంది బ్యాంకు ఖాతా తదితర వివరాలతో జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించిన సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: CM KCR, Gangula kamalakar, Sabitha Indra Reddy, Telangana, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు