• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TELANGANA PRIVATE TEACHERS APPLY LIKE THIS FOR TO GET GOVERNMENT FINANCIAL ASSISTANCE NS

Telangana Private Teachers: తెలంగాణలోని ప్రైవేట్ టీచర్లకు అలర్ట్.. ప్రభుత్వ సాయానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..

Telangana Private Teachers: తెలంగాణలోని ప్రైవేట్ టీచర్లకు అలర్ట్.. ప్రభుత్వ సాయానికి ఎలా అప్లై చేసుకోవాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు ఆర్థిక సాయంతో పాటు బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కింద లబ్ధి పొందడానికి ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

  • Share this:
    కరోనా నేపథ్యంలో పాఠశాలలు బంద్ కావడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ రోజు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి రూ. 2 వేల ఆర్థిక సాయంతో పాటు రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం అందిచనున్నట్లు ప్రకటించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించేంత వరకు ప్రతీ నెల ఈ సాయాన్ని ప్రభుత్వం వారికి అందించనుంది. అయితే.. ఈ ఆర్థిక సాయం ఎలా పొందాలి? ఇందు కోసం ఎలా అప్లై చేయాలి? అన్న విషయంలో క్లారిటీ లేక అనేక మంది గందరగోళానికి గురవుతున్నారు. గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్లలో పని చేసే వారంతా ఈ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అందుకోవడానికి అర్హులని సర్కారు స్పష్టం చేసింది. ప్రాథమికంగా అందిన సమాచారం ఆధారంగా.. ఆయా పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు వారి ఐడీ కార్డు, లేదా పాఠశాల వారు అందించే ఏదైనా ధ్రువపత్రంతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు, దరఖాస్తును జత చేసి కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పత్రాలను తనిఖీ చేసిన అనంతం అర్హులైన వారి ఖాతాలో డబ్బుల జమ కానున్నాయి. వారికే రేషన్ షాపుల నుంచి నుంచి బియ్యం అందించనున్నారు.

    అయితే.. ఈ పథకం విషయంలో శుక్రవారం ఉదయం మంత్రులు, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ పాల్గొననున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లాల పౌరసరఫరాల అధికారులు పాల్గొననున్నారు. పథకం అమలుపై వీరు స్పష్టమైన విధివిధానాలు రూపొందించనున్నారు. ఇందు కోసం కార్యాచరణ సైతం రూపొందించి ఆదేశాలు జారీ చేయనున్నారు. రేపు మంత్రుల సమావేశం అనంతరం పథకం అమలు విధివిధానాలపై పూర్తి క్లారిటీ రానుంది.

    అయితే గుర్తింపు పొందని స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఆయా వర్గాల వారి నుంచి వ్యక్తమవుతోంది. కొన్ని స్కూళ్లు, కాలేజీలు కరోనా ప్రారంభమైన కొన్ని నెలలకే సగానికి కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. అలాంటి వారు చాలా మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి వారికి సాయం అందుతుందా? లేదా? అన్న అంశంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. గతేడాది అంటే కరోనా కు ముందు వివిధ ప్రైవేటు పాఠశాలలు, స్కూళ్లలో పని చేసిన ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రమాణికంగా తీసుకుని ప్రభుత్వం సాయం అందించాలని ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది బాధితులు కోరుతున్నారు.  అయితే ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రేపటి మంత్రుల సమావేశం అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు