హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Post Office Recruitment 2021: తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో జాబ్స్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇలా అప్లై చేయండి

Telangana Post Office Recruitment 2021: తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో జాబ్స్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ పోస్టల్ సర్కిల్(Telangana Postal Circle) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల దేశ వ్యాప్తంగా పోస్టల్ ఉద్యోగాల(Post Office Jobs)భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అనేక ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్ అర్హతగా నిర్ణయించడంతో చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నోటిఫికేషన్ల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణ సర్కిల్ కార్యాలయం, హైదరాబాద్ పోస్టల్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ సైతం విడుదలైంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multi Tasking Staff), ఎల్డీసీ(Lower Division Circle), పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు సెప్టెంబర్ 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం పోస్టులు55

పోస్టల్‌ అసిస్టెంట్‌

 11

సార్టింగ్‌ అసిస్టెంట్‌

08

పోస్ట్‌మ్యాన్‌/ మెయిల్‌ గార్డ్‌

26

ఎంటీఎస్‌

10


Educational Qualifications:

1. Postal/Sorting Assistant: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తప్పనిసరిగా 12 వ తరగతి లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

2. Postman: 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. తప్పని సరిగా స్థానిక భాష్ (తెలుగు) వచ్చి ఉండాలి. కనీసం టెన్త్ వరకు టెన్త్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి. ఉద్యోగం పొందిన రెండేళ్లలోగా టూ వీలర్ లేదా లైట్ మోటార్ వెహికిల్, త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.

3.MTS: టెన్త్ పాసై లోకల్ లాంగ్వేజ్(తెలుగు) వచ్చిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టును కలిగి ఉండాలి.

క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

ISRO Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇస్రోలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 63 వేల వరకు వేతనం

Age Limit:

Postal Assistant /Sorting Assistant: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

Postman / Mail Guard: ఈ ఉద్యోగాలకు కూడా 18-27 ఏళ్లును వయో పరిమితిగా నిర్ణయించారు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు సడలింపు ఇచ్చారు.

MTS: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.

BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BELలో బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 50 వేల వరకు వేతనం

Application Process:

అభ్యర్థులు మొత్తం మూడు స్టెప్స్ లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

Step 1:  (Registration): అభ్యర్థులు పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు, పుట్టిన రోజు, మొబైల్ నంబర్, ఆధార్, చిరునామా, విద్యార్హతల వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Step 2:  (Fee Payment): ఈ దశలో రిజిస్ట్రేషన్ నంబర్ ను నమోదు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Step 3: (Apply Online): అనంతరం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు కావాల్సిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

Job Mela in AP: ఏపీలో మరో భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో నాలుగు ప్రముఖ కంపెనీల్లో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Selection Process: అభ్యర్థుల ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Salary Details: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ. 18 వేల నుంచి రూ. 81 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

First published:

Tags: Central govt employees, Government jobs, Hyderabad, India post, Post office, Telangana

ఉత్తమ కథలు