TELANGANA POLICE WARNS UNEMPLOYED OVER POLICE JOBS RECRUITMENT HERE FULL DETAILS NS
TS Police Jobs: అభ్యర్థులకు తెలంగాణ పోలీసుల సూచన.. అలా చేయొద్దని హెచ్చరిక.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (TS Police Jobs) అప్లై చేయాలనుకుంటున్న వారికి అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో భారీగా ఉద్యోగాల (TS Jobs) భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్లు (Job Notifications) సైతం విడుదల అవుతున్నాయి. పోలీస్ శాఖకు సంబంధించి 16, 614 ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఎస్ఐ పోస్టులు 587 ఉండగా.. కానిస్టేబుల్పోస్టులు 16,027 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ మే 2 న ప్రారంభం కాగా.. దరఖాస్తులకు మే 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో సూచించిన గడువులోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ యూనిట్లో నిరుపేద, వెనుకబడిన తరగతుల వారికి ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ శాఖ సూచించింది. అయితే.. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసకారులు/దళారులు/మధ్యవర్తులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. Telangana SI Jobs: తెలంగాణలో 587 ఎస్ఐ పోస్టులు... విద్యార్హతలివే
— Telangana State Police (@TelanganaCOPs) April 26, 2022
ఎవరైనా మేం పైరవీ చేస్తాం.. మీకు ఉద్యోగం ఇప్పిస్తాం అంటే నమ్మి మెసపోవద్దని నిరుద్యోగ యువతీ యువకులను హెచ్చరించారు పోలీసులు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. ఎవరైనా అటువంటి వారు మీ దృష్టికి వస్తే దగ్గరలోని పోలీసులకు తెలియజేయలని తెలంగాణ పోలీస్ శాఖ నిరుద్యోగులకు సూచించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది తెలంగాణ పోలీస్ శాఖ.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.