TELANGANA POLICE TSPSC JOBS UGC ONGC IB LIST OF GOVE JOBS TO APPLY IN THIS WEEK BA GH
Govt Jobs to Apply: తెలంగాణ పోలీస్ సహా ఈ నెలలో అప్లై చేసుకోదగిన గవర్నమెంట్ జాబ్స్ .. లాస్ట్ డేట్స్ ఇవే
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారా... అయితే ఈ నెలలో మీరు అప్లై (Apply) చేసుకోవడానికి చాలా ఉద్యోగాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు (Registration Process) ఓపెన్ అయి ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారా... అయితే ఈ వారంలో మీరు అప్లై (Apply) చేసుకోవడానికి చాలా ఉద్యోగాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు (Registration Process) ఓపెన్ అయి ఉన్నాయి. ప్రతి ఉద్యోగానికి సంబంధించి అధికారిక వెబ్సైట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఖాళీల సంఖ్య, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అందించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐబీ రిక్రూట్మెంట్ 2022 (IB Recruitment 2022)
ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II / టెక్నికల్ 2022 కోసం 150 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ 150 ఖాళీల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 56 ఖాళీలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 94 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 27 సంవత్సరాలు.
రీట్ 2022 (REET 2022)
రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ (REET) 2022 కోసం పరీక్ష తేదీని, దరఖాస్తు షెడ్యూల్‌ను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, రాజస్థాన్ తాజాగా ప్రకటించింది. రీట్ అనేది రాజస్థాన్‌లోని ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అర్హత పరీక్ష. ఈ పరీక్ష రెండు లెవెల్స్ లో జరుగుతుంది. లెవెల్ 1 ఎగ్జామ్ ప్రైమరీ టీచర్ రిక్రూట్మెంట్ కోసం జరిగితే... లెవెల్ II ఎగ్జామ్ అప్పర్ టీచర్ రిక్రూట్మెంట్ కోసం జరుగుతుంది.
జేకేపీఎస్సీ సీసీఈ (JKPSC CCE)
జమ్ము & కశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (JKPSC) 220 పోస్టులకు నిరుద్యోగులను రిక్రూట్ చేస్తోంది. అందులో J&K అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు 100, J&K పోలీస్ సర్వీస్‌లో 50 పోస్టులు, J&K అకౌంట్స్ సర్వీస్‌లో 70 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయడానికి, దరఖాస్తు రుసుమును ఇవ్వడానికి అభ్యర్థులకు మే 15, 2022 వరకు సమయం ఉంటుంది.
ONGC (ఓఎన్జీసీ)
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) 3614 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో నార్తర్న్ సెక్టార్లో 209, ముంబై సెక్టార్లో 305, వెస్ట్రన్ సెక్టార్లో 1434, ఈస్టర్న్ సెక్టార్లో 744, సదరన్ సెక్టార్లో 694, సెంట్రల్ సెక్టార్లో 228 ఉన్నాయి. ఫైనల్ సెలెక్టెడ్ లిస్టు మే 23, 2022న రిలీజ్ అవుతుంది. అప్రెంటిస్‌లను అర్హత పరీక్షలో పొందిన మార్కులు, డ్రా చేసిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు కనీస వయసు 18 ఏళ్లు, గరిష్టంగా 24 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు స్టేట్ బోర్డు టెక్నాలజీ ఎడ్యుకేషన్ (SBTE)/నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) ద్వారా గుర్తించిన సంబంధిత - ఐటీఐలు/టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ల అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
యూజీసీ నెట్ (UGC-NET)
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 పరీక్షల కోసం ఒకేసారి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సాధారణంగా, యూజీసీ నెట్ పరీక్ష ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. అయితే, ఈసారి, కోవిడ్ కారణంగా పరీక్షల షెడ్యూల్ మారింది. అందువల్ల యూజీసీ రెండు పరీక్ష సైకిల్స్ కలిపి ఉంచాలని నిర్ణయించింది. అభ్యర్థులు మే 20 రాత్రి 11:50 గంటల వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేసుకోవడానికి మే 21 నుంచి మే 23 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: మే 30, 2022
దరఖాస్తు చేసుకోవడానికి లింక్: ntanet.nic.in
హెచ్‌పీసీఎల్ (HPCL) రిక్రూట్మెంట్
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ ఎక్స్పర్ట్స్ , R&D ఎక్స్పర్ట్స్, ఇతర ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్/ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెచ్‌పీసీఎల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ తన సంస్థలో 186 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆపరేషన్స్ టెక్నీషియన్ 94, బాయిలర్ టెక్నీషియన్ 18, మెయింటెనెన్స్ టెక్నీషియన్ (మెకానికల్) 14, మెయింటెనెన్స్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) 17, మెయింటెనెన్స్ టెక్నీషియన్ 9 (ఇన్స్ట్రుమెంటేషన్, పోస్ట్స్టమెంటేషన్), ల్యాబ్ అనలిస్ట్ కోసం 16 పోస్టులు, జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కోసం 18 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా Bank of India Jobs
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) క్రెడిట్ ఆఫీసర్లు, ఇతర పోస్ట్‌లను భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ తన సంస్థలోని 696 పోస్టులను భర్తీ చేస్తుంది. ఎకనామిస్ట్, స్టాటిస్టిషియన్, రిస్క్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్స్, టెక్ అప్రైజల్, ఐటీ ఆఫీసర్-డేటా సెంటర్ కోసం 594 రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టులు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ ఐటీ , మేనేజర్ ఐటీ , మేనేజర్ ఐటీ (డేటా సెంటర్), సీనియర్ మేనేజర్ (నెట్వర్క్ రూటింగ్ & స్విచింగ్ స్పెషలిస్ట్‌లు), మేనేజర్ (డేటా సెంటర్) – స్టోరేజ్ & బ్యాకప్ టెక్నాలజీస్, మేనేజర్ (టెక్నాలజీఆర్కిటెక్ట్ ) కోసం మొత్తం 102 కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
దరఖాస్తుదారులు/అర్హత గల అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్లైన్ పరీక్ష లేదా GD లేదా వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2022 (Telangana Police Jobs)
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ల (SI) వరకు 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. అథారిటీ సమాచారం ప్రకారం ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ మే 2, 2022 నుంచి జరుగుతుంది. దరఖాస్తును సబ్ మిట్ చేయడానికి చివరి తేదీ మే 20, 2022. ఈ సెలక్షన్ విధానంలో ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ (PWT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫైనల్ రిటెన్ ఎగ్జామ్ (FWE) మూడు రౌండ్ల పరీక్షలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.