హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSLPRB Update: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మార్కులను కలిపి మరో లిస్ట్ విడుదల చేసిన బోర్డు..

TSLPRB Update: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మార్కులను కలిపి మరో లిస్ట్ విడుదల చేసిన బోర్డు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ ఆన్సర్స్ ప్రశ్నలకు మార్కులు కలపాలని పోలీస్ అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలపాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో(Preliminary Exam) మల్టిపుల్ ఆన్సర్స్ ప్రశ్నలకు మార్కులు కలపాలని పోలీస్ అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలపాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని ప్రకారం వాటిని కలుపుతూ.. దీని ద్వారా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్లో(Website) పొందుపరచనున్నట్లు పోలీస్ నియామక బోర్డు వెబ్ నోట్(Web Note) విడుదల చేసింది. వీటిని వారి వ్యక్తిగత లాగిన్ తో(Login) తెలుసుకోవాలని సూచించింది. వీటిని రేపు అనగా జనవరి 30, 2023న అందుబాటులో ఉంచుతామని నోటీస్ లో పేర్కొంది.

అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలని తెలిపింది.  ఇది వరకు నిర్వహించిన పీఈటీ, పీఎంటీ పరీక్షలో అర్హత సాధించిన వారు మరో సారి పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతే కాకుండా.. పీసీ/ఎస్సై లో ఏదో ఒకటి అర్హత సాధించి.. ఇప్పుడు పీసీ/ఎస్సైలో అర్హత సాధించిన వారు పార్ట్ 2 చేసుకోవాలని తెలిపింది. వీరికి మళ్లీ.. ఈవెంట్స్ నిర్వహించమని పేర్కొంది.

కొత్తగా అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్ నియామక బోర్డు నోటీస్ ద్వారా తెలిపింది.   పార్ట్ 2 దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5లోపు సమర్పించాలని సూచించింది.  ఈ తేదీలు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించడం కుదరదని పేర్కొంది.

TSPSC Applications: 8180 ఉద్యోగాలు .. రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు..

పీఈటీ/పీఎంటీ అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 మధ్య వెబ్ సైట్ లో  అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి వీరికి ఈవెంట్స్ నిర్వహిస్తామని నోటీస్ లో పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏడు ప్రాంతాల్లో పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుందని తెలిపారు.   ఏమైనా సందేహాలు అంటే.. 93937 11110 లేదా 93910 05006 నంబర్లను సంప్రదించాలని కోరింది.

First published:

Tags: JOBS, Tslprb

ఉత్తమ కథలు