హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SI And PC PET Admit Cards Released: తెలంగాణ పోలీస్ ఈవెంట్స్ అడ్మిట్ కార్డ్స్ విడుదల.. వివరాలిలా..

SI And PC PET Admit Cards Released: తెలంగాణ పోలీస్ ఈవెంట్స్ అడ్మిట్ కార్డ్స్ విడుదల.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో(Telangana) ఇప్పటికే పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో కూడా స్పీడ్ అందుకుంది. గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అత్యంత త్వరలో విడుదల కానున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో(Telangana) ఇప్పటికే పలు పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో కూడా స్పీడ్ అందుకుంది. గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అత్యంత త్వరలో విడుదల కానున్నాయి. పోలీస్ఉద్యోగాల విషయానికి వస్తే.. డిసెంబర్ 08, 2022 నుంచి పీఈటీ(PET), పీఎంటీ(PMT) పరీక్షలు నిర్వహించున్నట్లు పోలీస్ నియామక బోర్డు ప్రెస్ నోట్(Press Note) విడుదల చేసింది. రేపటి(నవంబర్ 29 ఉదయం 10) నుంచి ఈ దేహదారుడ్య పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల అవుతాయని ప్రెస్ నోట్ లో వెల్లడించినా.. నేడు నవంబర్ 28 రాత్రి నుంచే వాటిని అందుబాటులో ఉంచారు. ఇక్కడ క్లిక్ చేసి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.  అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్ కు చివరి తేదీ డిసెంబర్ 03, అర్థరాత్రి 12 గంటల వరకు ఈ అవకాశం ఇచ్చారు.

మొత్తం 11 కేంద్రాల్లో ఈ శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 08 నుంచి దాదాపు 25 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయనున్నారు.

Central Teacher Eligibility Test: అభ్యర్థులకు అలర్ట్.. CTETపై కీలక అప్ డేట్..

అభ్యర్థులు అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే విధానం ఇలా..

-మొదట అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

-దీనిలో వెబ్ సైట్ టాప్ లో కనిపిస్తున్న Download PMT / PET Admit Cards  ఆప్షన్ ను ఎంచుకోండి.

-దీనిలో అప్లికేషన్ లో ఇచ్చిన మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి.. దీంతో పాటు పాస్ వర్డ్ ఇవ్వాలి.

-తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ ను ఇస్తే మీ వ్యక్తిగత డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది.

-దీనిలో పీఎంటీ, పీఈటీ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ అనే ఆప్షన్ ను ఎంచుకొని.. హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

-దీనిలో పేర్కొన్న సూచనలను క్షణ్ణంగా చదువుకోవాలి. తర్వాత ఈ అడ్మిట్ కార్డును మీకు ఈవెంట్స్ జరిగే రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

1. అడ్మిట్ కార్డు లేదా ఇంటిమేషన్ లెటర్

2.పార్ట్ 2 దరఖాస్తు హార్డ్ కాపీ

3.కమ్యూనిటీ సర్టిఫికేట్ కాపీ

4.మాజీ సైనికోద్యుగులు పెన్షన్ పేమెంటల్ ఆర్డర్ కాపీ

5. గరిజన అభ్యర్థులు అయితే.. ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్

Gate 2023: గేట్ 2023 పరీక్ష షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..

పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ తో తమకు కేటాయించని సమయానికి ముందే సెంటర్ కు చేరుకోవాలని సూచించారు. తమతో పాటు.. ఏమైనా సామగ్రి తెచ్చుకుంటే.. వాటిని భద్ర పరచుకునేందుకు ఎలాంటి క్లాక్ రూంలు అందుబాటులో ఉండవని.. అనవసరమైన లగేజిని వెంట తెచ్చుకోవద్దని సూచించింది.

First published:

Tags: JOBS, Tslprb

ఉత్తమ కథలు