తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన తుది పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటుందని ప్రకటించింది. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన తుది పరీక్ష ఏప్రిల్ 23న ఉంటుందని ప్రకటించింది. పలు ప్రత్యేక విభాగాలకు చెందిన పోస్టులుకు సంబంధించిన పరీక్షలు మార్చి 12 నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటనలో పేర్కొంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
ఉదయం 10 నుంచి 1 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 ఉంటుందని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. ఇంకా.. హాల్ టికెట్లు విడుదలకు సంబంధించిన తేదీని త్వరలో విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, Telangana police jobs