తెలంగాణ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలను (Telangana Police Jobs Prelims Exam Dates) తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా విడుదల చేసింది. ఎస్ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇంకా కానిస్టేబుల్ పరీక్షను అదే నెల ఆగస్టులో 27 తేదీన నిర్వహించనున్నారు. నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను www.tslprb.in వెబ్ సైట్లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 7న నిర్వహించనున్న తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపుగా 2,45,000 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. కానిస్టేబుల్ ఎగ్జామ్ కు 6.50 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎస్ఐ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు జులై 30వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లను ఆగస్టు 10వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్ సైట్లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం ప్రకటించిన ఉద్యోగాల్లో మెజారిటీ పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. ఇందుకు సంబంధించి 554 ఎస్ఐ, 15,644 కానిస్టేబుల్ ఉద్యోగాల ఖాళీలకు ఏప్రిల్ 25న అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ హాల్ టికెట్లను తాజాగా విడుదల చేశారు. Telangana Teacher Jobs: తెలంగాణలో టీచర్ ఉద్యోగార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
ప్రిలిమ్స్ లో క్వాలిఫైన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ లు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ పరిక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగం లభిస్తుంది. అయితే సాధ్యమైనంత త్వరగా ఇందుకు సంబంధిచిన ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పని చేస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.