తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (TS Police Jobs) సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అలర్ట్. ఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు (Jobs) సంబంధించిన ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (TMT) లను డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు సైతం జోరుగా సాగుతున్నాయి. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 12 సెంటర్లను ఎంపిక చేశారు అధికారులు. ఆయా సెంటర్లలో కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ పరీక్షలను ప్రారంభించిన 25 రోజుల్లోనే ముగించాలన్న సంకల్పంతో ఉన్నారు అధికారులు.
ఈ ఫిజికల్ ఈవెంట్స్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఆయా మైదానాల్లో ఇంటర్ నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పనులు అనుకున్నట్లు జరిగితే నవంబర్ ఆఖరి వారంలోనే ఈ పరిక్షలు ప్రారంభించాలన్న లక్ష్యంతో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది.
పరీక్షలను నిర్వహించే ప్రదేశాలు ఇవే..
యూనిట్ | గ్రౌండ్ |
హైదరాబాద్ | ఎస్ఏఆర్ సీపీఎల్ అంబర్ పేట |
సైబరాబాద్ | 8వ బెటాలియన్ కొండాపూర్ |
రాచకొండ | సరూర్ నగర్ స్టేడియం |
సంగారెడ్డి | పోలీస్ పరేడ్ గ్రౌండ్ |
కరీంనగర్ | సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం |
సిద్దిపేట | పోలీస్ పరేడ్ గ్రౌండ్ |
ఆదిలాబాద్ | పోలీస్ పరేడ్ గ్రౌండ్ |
నిజామాబాద్ | రాజారాం స్టేడియం, నాగారం (నిజామాబాద్) |
మహబూబ్ నగర్ | డిస్ట్రిక్ట్ స్టేడియం స్పోర్ట్స్ గ్రౌండ్ |
వరంగల్ | హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం |
నల్గొండ | మేకల అభినవ్ స్టేడియం |
ఖమ్మం | పోలీస్ పరేడ్ గ్రౌండ్ |
PRESS NOTE: పోలీస్ రిక్రూట్మెంట్ శరీర దారుడ్య పరీక్షల కోసం నాగరంలోని రాజారాం స్టేడియంను పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ K.R.నాగరాజు IPS గారు. pic.twitter.com/JgtvBcd8eE
— Nizamabad Police (CP Nizamabad) (@cp_nizamabad) November 16, 2022
ఈవెంట్స్ ఒకేసారి..
గతంలో అభ్యర్థులు ఎస్ఐ ఉద్యోగాలకు ఒక సారి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో సారి ఈవెంట్స్ కు హాజరుకావాల్సి ఉండేది. దీంతో అభ్యర్థులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ రూల్ ను మార్చారు. ఎన్ని పోస్టులకు అప్లై చేసినా ఒకే సారి అర్హత సాధిస్తే సరిపోయాలా నిబంధనలను సడలించారు. ఇది అభ్యర్థులకు ఉపయోగడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Police jobs, State Government Jobs, Telangana police jobs