Home /News /jobs /

TELANGANA POLICE JOBS TSAT CONDUCTING AWARENESS PROGRAM ON TSLPRB RECRUITMENTS HERE DETAILS NS

Telangana Police Jobs: తెలంగాణ పోలీస్ జాబ్స్ విషయంపై సందేహాలు ఉన్నాయా? అయితే, ఈ నంబర్లకు కాల్ చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో భారీగా పోలీస్ ఉద్యోగాల (Police Jobs) భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ (Job Notification) విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు T-SAT Network రేపు లైవ్ నిర్వహిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల (Police Jobs) భర్తీకి సంబంధించి ఇటీవల భారీ నోటిఫికేషన్లను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధిచిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న T-SAT నెట్వర్క్ పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటున్న అభ్యర్థుల కోసం ఉచితంగా శిక్షణను ఆన్లైన్లో అందిస్తోంది. ఇంకా నిపుణుల ద్వారా సలహాలు, సూచనలను సైతం అందిస్తోంది. ఇటీవల తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ తో లైవ్ నిర్వహించి అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న అనేక సందేహాలకు సమాధానాలను అందించింది T-SAT నెట్ వర్క్.

    తాజాగా.. పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంపై మరో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు T-SAT వెల్లడించింది. ‘‘TSLPRB (పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు)-పోలీస్ ఉద్యోగాల భర్తీ విధానం’’ అంశంపై లైవ్ నిర్వహించనున్నారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు టీ-సాట్ నిపుణ చానల్ లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.
    TS Jobs Latest Updates: తెలంగాణ పోలీస్, గ్రూప్స్ తదితర ప్రభుత్వ జాబ్స్ లేటెస్ట్ అప్ డేట్స్ కావాలా? అయితే ఇలా నమోదు చేసుకోండి



    ఏసీపీ పీ.మధూకర్ స్వామి హాజరై అభ్యర్థుల సందేహాలకు సమాధానం ఇవ్వనున్నారు. అభ్యర్థులు తమ సందేహాలను 040-23540326/726, టోల్ ఫ్రీ: 18004254039 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని టీసాట్ సూచించింది. అభ్యర్థులు T-SAT అధికారిక యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు