హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Police Jobs Events: తెలంగాణ పోలీస్ నియామకాల్లో ఊహించని ట్విస్ట్.. ఈవెంట్స్ లో రిజర్వేషన్ల కోసం కొత్త డిమాండ్.. వివరాలివే

TS Police Jobs Events: తెలంగాణ పోలీస్ నియామకాల్లో ఊహించని ట్విస్ట్.. ఈవెంట్స్ లో రిజర్వేషన్ల కోసం కొత్త డిమాండ్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో నిన్న ప్రారంభమైన ఈవెంట్స్ కు దాదాపు 10 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా.. 60 శాతం మంది అర్హత సాధించారు. అయితే.. ఈవెంట్స్ కు సంబంధించి మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 20 వేలకు పైగా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన రెండు దశ ఎంపిక ప్రక్రియ అయిన దేహ దారుఢ్య పరీక్షలు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం 12 కేంద్రాలను ఈ ఈవెంట్స్ (TSLPRB Events) కోసం ఎంపిక చేయగా.. సిద్దిపేట మినహా మిగతా అన్ని కేంద్రాల్లో ప్రారంభం అయ్యాయి. సిద్దిపేటలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఈవెంట్స్ నిర్వహించడానికి ఎంపిక చేయడంతో అక్కడ ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. దీంతో అక్కడ ఈవెంట్స్ ను వాయిదా వేసిన యంత్రాంగం త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. నిన్న జరిగిన ఈవెంట్స్ కు దాదాపు 10 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా.. 60 శాతం మంది అర్హత సాధించారు. ఇదిలా ఉంటే.. ఈవెంట్స్ కు సంబంధించి మరో కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన ట్రాన్స్ జెండర్లకు (Transgenders) ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఈవెంట్స్ ను నిర్వహిస్తున్న అధికారులు తమకు వేరుగా ఎందుకు నిర్వహించరని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈవెంట్స్ కు సంబంధించిన ఇప్పుడు ఉన్న నిబంధనలతో తాము మహిళలు, పురుషలతో పోటీ పడలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని, రూల్స్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వరంగల్ కమిషనర్ ను ఈ రోజు కలిసి ట్రాన్స్ జెండర్లు వినతి పత్రం ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షలకు 12 మంది ట్రాన్స్ జెండర్లు హాజరు కాగా.. వారిలో నందిని, తనుశ్రీ, లవ్ లీ, శ్రావ్య శ్రీ అనే నలుగురు ట్రాన్స్ జెండర్లు అర్హత సాధించారు.

TSPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. ఏ శాఖలో అంటే?

ఇదిలా ఉంటే.. ట్రాన్స్  జెండర్లకు ఈవెంట్స్ ఎలా నిర్వహించాలన్న అంశంపై అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. వారికి పురుషులతో కలిపి నిర్వహించాలా? లేదా మహిళా అభ్యర్థులతో కలిపి నిర్వహించాలా? అన్న విషయం అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ ట్రాన్స్ జెండర్లు ఈ అంశంపై కోర్టుకు వెళ్తే నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తం అవుతోంది.

First published:

Tags: JOBS, Telangana police jobs, Transgender, Tslprb

ఉత్తమ కథలు