TELANGANA POLICE JOBS TODAY LAST DATE FOR APPLICATIONS HERE TOTAL APPLICATIONS DETAILS NS
TS Police Jobs: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్.. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ల లెక్కలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయితే.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో పోలీస్ జాబ్స్ (Telangana Police Jobs) కు సంబంధించిన దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ను తెలంగాణ స్టేల్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నెల 2వ తేదీన ప్రారంభించింది. మొదట ఈ నెల 20ని దరఖాస్తులకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే ప్రభుత్వం ఆఖరి నిమిషంలో వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. మరింత మంది అభ్యర్థులకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ నెల 26 వరకు గడువును పొడిగించారు. ఆ గడువు సైతం ఈ రోజుతో ముగియనుంది. అభ్యర్థులు ఈ రోజు రాత్రి 10 గంటల వరకు అప్లై చేసుకోవాలని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ 70 వేల మంది అభ్యర్థుల నుంచి 1.40 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు తెలిపింది. దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియనుండడంతో శుక్రవారం రోజు పూర్తి దరఖాస్తుల సంఖ్యను వెల్లడించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ రావు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే దరఖాస్తు గడువును ఒక సారి పొడిగించడంతో.. మరోసారి పొడింగించే అవకాశం లేనట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.