తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియామకాలకు (Telangana Police Jobs) సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. నియామకాలకు సంబంధించి ప్రిలిమ్స్ మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఫైర్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సైతం ప్రిలిమ్స్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ (CM KCR) కు ఆయన లేఖ రాశారు. ఇటీవల విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీలకు 20%, బీసీలకు 25%, జనరల్ అభ్యర్థులకు 30% కటాఫ్ మార్కులుగా నిర్ణయించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు బండి సంజయ్. దీంతో 40. మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీలు, 50 మార్కులు వచ్చిన బీసీలు, 60 మార్కులు వచ్చిన జనరల్ అభ్యర్థులకు మెయిన్ పరీక్షకు అర్హత పొందుతారన్నారు. అయితే.. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపులివ్వకపోవడం వల్ల వారు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగా ప్రిలిమ్స్ 60, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారే మెయిన్ పరీక్షకు అర్హత పొందుతారన్నారు. రిజర్వేషన్ లేని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చిందన్నారు.
ఆ రిజర్వేషన్లతో అగ్రవర్ణాల పేదలకు న్యాయం చేసిందన్నారు. అయితే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మాత్రం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపునివ్వకపోవడం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ను సవరించాలని సీఎం కేసీఆర్ ను ఆయన కోరారు.
Telangana: తెలంగాణ యువతకు శుభవార్త.. టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన వారికి ఉచితంగా శిక్షణ, ఉపాధి..
పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ లో ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/cTXw3mg9Zj
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 9, 2022
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ 25% అంటే 50 మార్కులను కటాఫ్ గా నిర్ణయించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే.. బండి సంజయ్ డిమాండ్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఇదిలా ఉంటే తెలంగాణ పోలీస్ నియామకాలకు సంబంధించి ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయో తెలియక అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా.. బోర్డు నుంచి ఫలితాలకు సంబంధించిన అప్డ్సేట్స్ ఏమీ రాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బోర్డు స్పందించి నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, JOBS, Telangana government jobs, Telangana police jobs