Home /News /jobs /

TELANGANA POLICE JOBS SI PRELIMS EXAM HALL TICKETS RELEASED HERE IS THE DIRECT LINK TO DOWNLOAD NS

TS SI Prelims Hall Tickets Download: తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు (TS SI Jobs) దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల (Telangana Police Jobs) భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ (TS Prelims Exams) కు సంబంధించిన తేదీలను సైతం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) విడుదల చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ రోజు విడుదల చేసింది. అభ్యర్థులు బోర్డ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. support@tslprb.in కు మెయిల్ పంపించి కూడా సహాయాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు సూచించారు.

    అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది..
    Step 1: అభ్యర్థులు మొదటగా బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం హోం స్క్రీన్ లో Download Hall Tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    TS SI Preparation Tips: ఎస్సై, కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..



    Step 3: అనంతరం Sign in పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మొబైల్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి.
    Step 4: దీంతో మీ హాల్ టికెట్ హోం పేజీపై డిస్ప్లే అవుతుంది. డౌన్ లోడ్ చేసుకోవాలి.


    ఇదిలా ఉంటే.. జులై 30న కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. అయితే  ఎస్ఐ మరియు కానిస్టేబుల్ జాబ్స్ కు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 6.50 లక్షల మంది, ఎస్ఐ ఉద్యోగాలకు కు సంబంధించి 2.45 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకోవడంతో రిక్రూట్మెంట్ బోర్డు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Police jobs, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు